బంపర్ ఆఫర్ ప్రకటించిన ఎయిర్ ఏషియా..!!
- January 09, 2017
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ఇండియా తన ప్రయాణికులకు అతి తక్కువ ధరకే టికెటు అందిస్తున్నట్లు ప్రకటించింది. '2017 ఎర్లీ బర్డ్ సేల్' పేరుతో రూ.799లకే ప్రారంభ ధర నిర్ణయించింది. 2017 మే 1 నుంచి 2018 ఫిబ్రవరి 6 వరకు ప్రయాణించే వారికి ఈ ఆఫర్ వరిస్తుందని, జనవరి 15న ఆఫర్ ముగుస్తున్నట్లు ప్రకటించింది.
* బెంగళూరు-కొచ్చీకి రూ.999.
* ఇంఫాల్-గువాహటీకి రూ.799.
* కొచ్చీ-హైదరాబాద్ రూ.1,499. .
* హైదరాబాద్-గోవా రూ.1499.
* ఛండీగఢ్-బెంగళూరు మధ్య రూ.2,999గా టికెట్ ధరను నిర్ణయించింది.
విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోవటంతో వారిని ఆకట్టుకునేందుకు ఎయిర్లైన్స్ పలు ఆఫర్లను ప్రకటిస్తోంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపిన వివరాల ప్రకారం 2016 జనవరి నుంచి నవంబర్ వరకు విమాన ప్రయాణం చేసే వారి సంఖ్య 23 శాతం పెరిగిందని తెలిపింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







