ముంబయిలో అతిపెద్ద పబ్లిక్ వైఫై సర్వీసు...
- January 09, 2017
ముంబయి: ప్రజలకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం 500 వైఫై హాట్స్పాట్లను ప్రకటించింది. మే 1 నాటికి ఆ సంఖ్య 1200కి చేరేలా ప్రయత్నిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ తెలిపారు. ముంబయి వైఫై సర్వీసు భారత్‌లోనే అతిపెద్ద పబ్లిక్వైఫై సర్వీస్‌గా ఉందని, ప్రపంచంలో ఒకటిగా నిలిచిందని సీఎం ట్విటర్ ద్వారా పేర్కొన్నారు. వైఫై సదుపాయాలు ఎలా ఉన్నాయి, వాటి పనితీరు, వేగంగా ఉందా లేదా అనే దానిపై నిరంతరం పర్యవేక్షిస్తుంటామని ఆయన తెలిపారు. ప్రయోగాత్మక దశలో భాగంగా జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు నగరం మొత్తం మీద 23వేల మంది యూజర్లు 2టీబీ పైన డేటాను డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు.
తాజా వార్తలు
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!







