GHMC మేయర్ బొంతు రామ్మోహన్ తో మాగల్ఫ్.కామ్ వారి ముఖాముఖి

GHMC మేయర్  బొంతు రామ్మోహన్ తో మాగల్ఫ్.కామ్ వారి ముఖాముఖి

GHMC మేయర్ బొంతు రామ్మోహన్ దుబాయ్ విచ్చేసిన సందర్భంగా మాగల్ఫ్.కామ్ వారితో ముఖాముఖీ.

 

ప్ర) మేయర్ గా మీ ప్రయాణం ఎలా ప్రారంభమయింది?

జ) 2001 నుండి 'టిఆర్ఎస్ విద్యార్థి విభాగం' అధ్యక్షునిగా, పార్టీ సెక్రెటరీగా, పార్టీ యూత్ ప్రెసిడెంట్ గా చేసిన అనుభవమే ఈ రోజు హైదరాబాదుకు మేయర్ గా సేవలు అందించటానికి సులభం అయింది.

 

ప్ర) హైదరాబాదు మహానగరానికి మేయర్ గా వ్యవహరించడంపై మీ స్పందన?

జ) తెలంగాణా రాష్ట్ర అవతరణకు ఎంతో కృషి చేసి పట్టువదలని విక్రమార్కుడిలా 14 సంవత్సరాలు పోరాడి తెలంగాణా రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాదుకు మేయర్ గా నా సేవలు అందించటం చాలా గర్వంగా ఉంది. మేయర్ గా నేను గెలుస్తానని ఊహించలేదు; కష్టపడి పనిచేయటం అలాగే కేసీఆర్ గారికి నమ్మకంగా ఉండటంవల్లనే ఈ అవకాశం వచ్చిందని భావిస్తున్నాను.

 

ప్ర) కేటీఆర్ తో మీకున్న అనుబంధం గురించి చెప్పగలరా?

జ) పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారితో 14 సంవత్సరాల ఉద్యమంలో పాటు ఒకే కుటుంబంలా పనిచేసిన అనుభవం మరియు సంబంధం ఉన్నది కాబట్టే ఈ రోజు ప్రతి విషయంలో కో-ఆర్డినేషన్తో అభివృద్ధి పై ప్రణాళికలు తయారుచేయటానికి వీలవుతోంది.

 

ప్ర) జి.హెచ్.యం.సి పరిధిలో ప్రస్తుతం చేపట్టిన ప్రణాళికలేవి?

జ) హైదరాబాదు నగర విస్తీర్ణం రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో మేము చేపట్టిన ప్రణాళికలు ఏమనగా: పెరిగిన జనాభాకు అనుగుణంగా మౌళిక వసతులు కల్పించటం, అందులో మొదటిగా రోడ్లను క్రమబద్ధీకరించటం, డ్రైనేజ్ వ్యవస్థను క్రమబద్ధీకరించటం, మంచి నీటి వ్యవస్థను మెరుగు పరచటం.

 

ప్ర) రోజు రోజుకూ పెరుగుతున్న జనాభాకు మీరు అందిస్తున్న అదనపు సౌకర్యాల గురించి వివరిస్తారా?

జ) పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా వెజిటబుల్ మార్కెట్ గానీ, బస్సు టెర్మినల్స్ గానీ, స్మశాన వాటికలు గానీ,ఉన్న పార్కులను ఆధునీకరించటం మరియు మరికొన్ని కొత్తవి కల్పించటం జరుగుతోంది.

 

ప్ర) ఈమధ్య వచ్చిన వరదలకు హైదరాబాదు అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. మరి ఇలాంటి ఉపద్రవాలు సంభవించినప్పుడు మీరు తీసుకోనున్న ప్రణాళికలు ఎలాంటివి?

జ) వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్ నగరం లో జి.హెచ్.యం.సి సిబ్బందే కాక వాటర్ బోర్డు,ఎలక్ట్రిసిటీ, మిలిటరీ,యన్.డి.ఆర్.యఫ్ సిబ్బంది మరియు మీడియా,పోలీస్ సహకారంతో తగిన చర్యలు చేపడటం జరిగింది.అన్ని లైన్ డిపార్టుమెంట్ల లో జి.హెచ్.యం.సి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రజలను రక్షించగలిగాము.

 

ప్ర) తెలుగు రాష్ట్రాల విభజన పై మీ అభిప్రాయం?

జ) రాష్ట్రం విడిపోయాక సహజంగా చిన్న రాష్ట్రం కాబట్టి అడ్మినిస్ట్రేషన్ లో గానీ, అభివృద్ధి లో గానీ, నగర శాంతి భద్రతలో గానీ, నగరంలో వచ్చే ప్రాజెక్టుల్లో గానీ దృష్టి పెట్టటం సులువు అయ్యింది మరియు కొత్త పరిశ్రమలు రావటం జరిగింది. 

 

ప్ర) యువతకు మీరిచ్చే సందేశం?

జ) వయసు చిన్నదని కేసీఆర్ గారి సాన్నిహిత్యంతో ప్రతి నిత్యం వారి వెన్నంటి ఉండి నేర్చుకున్న అనుభవం నిజంగా ఈ రోజు నాకెంతో ఉపయోగాన్ని ఇచ్చింది. ఈనాటి యువత రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకి మెరుగైన, తమదైన ఆలోచనలతో ఆధునిక పద్ధతుల ద్వారా సేవలు అందించాలని కోరుకుంటున్నా.

Back to Top