అబుధాబి లోని భారత రాయబారి ని కలిసిన తెలంగాణ ప్రవాసులు
- January 10, 2017తెలంగాణ కు చెందిన వలస కార్మిక నాయకులు పి.నారాయణ స్వామి నాయకత్వంలో ఐదుగురు సభ్యుల బృందం బెంగళూరు లో జరుగుతున్న ప్రవాసి భారతీయ దివస్-2017 ఉత్సవాలకు హాజరయ్యారు. ఈ నెల 9 న సోమవారం కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రులు డా. వికె సింగ్, ఎంజె అక్బర్ లను కలిసి ఎన్నారైలు, ప్రవాసి కార్మికుల సంక్షేమానికి భారత ప్రభుత్వం తీసుకోవలసిన చర్యల గురించి విజ్ఞప్తి చేశారు. వీరితో పాటు దుబాయికి చెందిన గిరీష్ పంత్, షార్జాకు చెందిన జనగామ శ్రీనివాస్ ఉన్నారు.
యు.ఏ.ఈ దేశంలోని అబుధాబి లోని భారత రాయబారి నవదీప్ సూరి ని కలిసి గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రస్తావించారు. భారత్ - యు.ఏ.ఈ దేశాల మధ్య కుదిరిన ఖైదీల బదిలీ ఒప్పందం అమలు, దుబాయి జైల్లో ఉన్న సిరిసిల్ల కు చెందిన ఐదుగురు ఖైదీల విడుదల, షార్జా జైల్లో ఉన్న మూటపల్లి కి చెందిన ధరూరి బుచ్చయ్య విడుదల గురించి విజ్ఞప్తి చేశారు. అబుదాబి అగ్ని ప్రమాదం లో మరణించిన తెలంగాణకు చెందిన ఐదుగురి మృత దేహాలను త్వరగా పంపాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇండెక్స్..8వ స్థానంలో ఒమన్..!!
- అమీర్ భారత్ పర్యటన విజయవంతం..!!
- సౌదీలో ముగ్గురు విదేశీయులు అరెస్ట్..!!
- శిథిల భవనాల కోసం అత్యవసర టాస్క్ఫోర్స్.. ఎంపీలు ఆమోదం..!!
- Dh1 స్కామ్: ఏఐతో వేలాది దిర్హామ్స్ కోల్పోయిన బాధితులు..!!
- అంతరాష్ట్ర ఎన్.డి.పి.ఎల్ సరఫరా చైన్ భగ్నం
- కువైట్ లో తీవ్రమైన పార్కింగ్ కొరత..అధ్యయనం..!!
- పామర్రు జనసేన పార్టీ శ్రేణులతో బండిరామకృష్ణ సమావేశం
- ప్రతి బింబాలు కథా సంపుటి ఆవిష్కరణ
- శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు ప్రారంభం