బ్రోతల్‌ హౌస్‌ నిర్వహణ: నలుగురి అరెస్ట్‌

- January 10, 2017 , by Maagulf
బ్రోతల్‌ హౌస్‌ నిర్వహణ: నలుగురి అరెస్ట్‌

నలుగురు నిరుద్యోగులపై బ్రోతల్‌ హౌస్‌ ఆరోపణలపై కేసులు నమోదు చేయబడ్డాయి. స్వదేశం నుంచి మహిళల్ని అక్రమంగా తరలించి, వ్యభిచార కార్యకలాపాల్ని ఓ అపార్ట్‌మెంట్‌లో నిర్వహిస్తూ నలుగురు నిందితులు పోలీసులకు చిక్కారు. ఈ వ్యక్తులందరూ 20 నుంచి 24 ఏళ్ళ వయసువారే. నలుగురికీ ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. ఈ ఘటనలో బాధితురాలైన వియాత్నాంకి చెందిన మహిళ, జరిగిన ఘటనను వివరించింది. ఎయిర్‌పోర్ట్‌లో తనను కొందరు వ్యక్తులు కలుసుకున్నారనీ, వారు తనను బలవంతంగా ఫ్లాట్‌కి తీసుకెళ్ళి, వ్యభిచారం చేయమని ఒత్తిడి చేశారనీ, వారి మాట వినకపోవడంతో తనను దారుణంగా కొట్టారని న్యాయస్థానానికి తెలిపింది. తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, అలాగే ఎంబసీకి వివరాలు తెలిపి ఎలాగోలా బయటపడ్డానని ఆమె వివరించింది. బాధితురాలు, నలుగురు నిందితుల్ని గుర్తించింది. దుబాయ్‌ ఫౌండేషన్‌ ఫర్‌ విమెన్‌ అండ్‌ చిల్డ్రన్‌లో బాధితురాలికి ఆవాసం కల్పించారు అధికారులు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com