నటి రంభకు సమన్లు జారీ...

- January 11, 2017 , by Maagulf
నటి రంభకు సమన్లు జారీ...

 జూబ్లీహిల్స్‌: సినీ నటి రంభకు బంజారాహిల్స్‌ పోలీసులు సమన్లు జారీ చేశారు. అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని రంభ సోదరుడి భార్య ఫిర్యాదుతో మంగళవారం రాత్రి నగరానికి వచ్చిన ఆమెకు పోలీసులు వీటిని అందించారు. పోలీసుల వివరాల ప్రకారం.. రంభ సోదరుడు శ్రీనివాసరావుపైనా, అతని కుటుంబ సభ్యులపై అతని భార్య పల్లవి అదనపు కట్నం వేధింపుల కేసు దాఖలు చేసింది. ఈ కేసులో రంభకు సమన్లు జారీ చేసేందుకు ప్రయత్నించగా ఆమె అమెరికాలో ఉండటంతో సాధ్యపడలేదు. మంగళవారం రాత్రి ఓ బుల్లితెర ప్రదర్శనకు ఆమె హాజరు కాగా పోలీసులు సమన్లు అందచేశారు. .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com