అడ్‌నాక్ రిఫైనరీలో అగ్ని ప్రమాదం..
- January 12, 2017
రువైస్‌లోని తక్రీర్ రిఫైనరీ వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ (అడ్‌నాక్) ఈ విషయాన్ని ధృవీకరించింది. ప్రమాద కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే ప్రమాద స్థలంలో ఎవరూ గాయపడ్డంగానీ, చనిపోవడంగానీ జరగలేదని అడ్‌నాక్ అధికార ప్రతినిథి చెప్పారు. ప్రమాద ఘటనపై విచారణ జరుగుతున్నట్లు ఆయన వివరించారు. ఇంకో వైపున ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సేఫ్టీ విభాగం అప్రమత్తమై మంటల్ని అదుపు చేసింది. 1999లో అబుదాబీ ఆయిల్ కంపెనీ తక్రీర్ ఏర్పాటయ్యింది. ప్రమాదం జరిగిన చోట పెట్రోలియం ప్రోడక్ట్స్, అలాగే గ్రాన్యూల్డ్ సల్ఫర్ వంటివి ఉత్పత్తి అవుతాయి. అబుదాబీ వెస్ట్రన్ రీజియన్‌లో 250 కిలోమీటర్ల దూరంలో దీన్ని ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- నైజీరియాలో మసీదులో బాంబు పేలుడు 10 మంది మృతి
- దుబాయ్లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు
- ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్లో అత్యవసర ల్యాండింగ్
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు చేసిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్కు ఘన అభినందన సభ







