ఫేక్‌బాంబ్: ఒకరి అరెస్ట్..
- January 12, 2017
నిరుద్యోగి ఒకరు ఫేక్ బాంబ్‌తో 5,500 దిర్హామ్‌ల దోపిడీకి యత్నించాడు. నిందితుడ్ని 30 ఏళ్ళ బ్రిటిష్ వ్యక్తిగా గుర్తించారు. టిష్యూ బాక్స్‌లో ఫేక్ బాంబ్‌ని సృష్టించాడతడు. దాన్ని టేప్‌తో బాంబు తరహాలో తయారు చేశాడు. 5,500 దిర్హామ్‌ల దోపిడీకి యత్నించిన అతన్ని ఫిలిప్పీన్‌కి చెందిన మేనేజర్ వ్యూహాత్మకంగా అడ్డగించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అక్కడి నుంచి చాకచక్యంగా నిందితుడు తప్పించుకున్నాడు పోలీసులు వచ్చేసరికి. ఆ తర్వాత పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ ఘటనకు తాను బాధ్యుడిని కానని నిందితుడు, న్యాయస్థానంలో వాదించాడు. కేసులో వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఫిలిప్పీన్‌కి చెందిన మేనేజర్ నేరం జరిగిన తీరుని న్యాయస్థానానికి వివరించడం జరిగింది. పోలీసులు కేసు విచారణ విషయాల్ని కోర్టు ముందుంచారు. ఈ నెలాఖరుకు ఇంకోసారి ఈ కేసు విచారణ జరుగుతుంది.
తాజా వార్తలు
- నైజీరియాలో మసీదులో బాంబు పేలుడు 10 మంది మృతి
- దుబాయ్‌లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు
- ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు చేసిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్‌కు ఘన అభినందన సభ







