వాట్సాప్ ద్వారా పెళ్లి చేసుకోవచ్చు!...
- January 12, 2017
సామాజిక మాధ్యమంగా ఎక్కువగా పాపులర్ అయిన వాట్సాప్ ద్వారా పెళ్లిళ్లు జరుగబోతున్నాయి. ఒంటరిగా ఉంటున్న మహిళలకు కొత్త జీవితాన్ని అందించాలని ఉద్దేశ్యంతో సౌదీ అధికారులు ఓ వినూత్న ఐడియాతో ముందుకొచ్చారు. మహిళలకు పెళ్లిళ్లు ఫిక్స్ చేయడం కోసం వాట్సాప్ ను సాధనంగా ఎంచుకుని ఓ గ్రూపును క్రియేట్ చేశారు. పాలిగమీ పేరుతో ఎనిమిది మంది సౌదీ అధికారులు ఈ గ్రూప్ ను రూపొందించారు. ఈ గ్రూప్ లో ఇప్పటికే 900 మంది మహిళలు రిజిస్ట్రర్ చేసుకున్నారు. పాలీగమీ విశేషమేమిటంటే.. దానిలో విడాకులు తీసుకున్న మహిళలు, వితంతువులు, పెళ్లికాని వారు పేర్లు నమోదుచేసుకోవచ్చు. మక్కా సిటీలో ఎక్కువగా డైవర్స్ కేసులు పెరిగిపోతుండటాన్ని గమనించిన అధికారులు, వారికో తోడు అందించాలనే ఉద్దేశంతో ఈ ఐడియాతో ముందుకొచ్చారు.
సౌది మహిళలతో పాటు యెమెన్, మోరోకో, సిరియా, పాలస్తీనా, ఈజిస్ట్, నైజీరియా, బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్ లోని మహిళలు కూడా ఈ వాట్సాప్ గ్రూప్ లో పేర్లను నమోదుచేసుకున్నారు. ఈ వాట్సాప్ గ్రూప్ లో పేర్లు నమోదుచేసుకున్న మహిళలు రెండో, మూడో, నాలుగో భార్యగైనా వెళ్లడానికి వారికి తాము సిద్దమని పేర్కొన్నట్టు తెలిసింది. నమోదు జాబితా ప్రకారం దీనిలో అతిపెద్ద వయసున్న అమ్మాయికి 55 సంవత్సరాలు కాగ, తక్కువ వయసున్న అమ్మాయికి 18 సంవత్సరాలు. ఎత్తు ప్రకారం చూసుకుంటే, 4'7" నుంచి 5'10" ఎత్తు ఉన్న మహిళలున్నారు. కొంతమంది మహిళలు తమకు కావాల్సిన అబ్బాయిలు ఎలా ఉండాలి, ఎలాంటి వాటిని అంగీకరించాలో కూడా ఆ గ్రూప్ లో పేర్కొన్నారు. ఉచిత సర్వీసు ఫీజుతో వారికి పెళ్లి కుదుర్చుతామని మ్యారేజ్ అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్‌గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!
- ఒమన్‌లో 2,510 క్యాన్సర్ కేసులు నమోదు..!!
- సౌదీ అరేబియాలో 2,200 హోండా కార్లు రీకాల్..!!
- కతారాలో 'ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ' ప్రదర్శన..!!
- హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!
- కువైట్ లో 15 ప్రైవేట్ ఫార్మసీలు సీజ్..!!
- 2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే..
- వైభవ్‌కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్







