డాక్టర్లు, నర్సులకు పింక్‌ క్యారవాన్‌ పిలుపు

- January 12, 2017 , by Maagulf
డాక్టర్లు, నర్సులకు పింక్‌ క్యారవాన్‌ పిలుపు

షార్జా: బ్రెస్ట్‌ క్యాన్సెర్‌ అవేర్‌నెస్‌ ఇనీషియేటివ్‌ 'పింక్‌ కారవాన్‌', రెసిడెంట్‌ డాక్టర్లు మరియు నర్సులు 7వ యాన్యువల్‌ రైడ్‌లో పాల్గొనాల్సిందిగా పిలుపునిస్తోంది. ఫ్రెండ్స్‌ ఆఫ్‌ క్యాన్సెర్‌ పేషెంట్స్‌తో ఈ అవేర్‌నెస్‌ క్యాంపెయిన్‌ని 'సెవెన్‌ ఇయర్స్‌ ఫర్‌ సెవెన్‌ ఎమిరేట్స్‌' పేరుతో మార్చ్‌ 7న షార్జాలో ప్రారంభిస్తారు. జనవరి 12 నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు ఈ కార్యక్రమానికి సంబంధించి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. జనరల్‌ మెడిసిన్‌, ఫ్యామిలీ మెడిసిన్‌ మరియు రేడియాలజీ, ప్లస్‌ ఎక్స్‌రే టెక్నీషియన్లు మరియు నర్సులు ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొనవచ్చు. ఉచితంగా స్క్రీనింగ్‌ టెస్టులు చేయడానికి, అలాగే బ్రెస్ట్‌ క్యాన్సర్‌ పట్ల అవగాహన కల్పించడానికీ ఈ కారవాన్‌ ఉపయోగపడ్తుంది. పబ్లిక్‌ మరియు ప్రైవేట్‌ క్లీనిక్స్‌లో 500 నుంచి 1000 దిర్హామ్‌లు ఖర్చయ్యే పరీక్షల్ని పింక్‌ కారవాన్‌ రైడ్‌లో ఉచితంగా నిర్వహిస్తారు. గత ఆరేళ్ళుగా పింక్‌ కారవాన్‌ రైడ్‌ విజయవంతంగా కొనసాగుతూ, బ్రెస్ట్‌ క్యాన్సర్‌ పట్ల అవగాహన కల్పిస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com