బేసిన్ గట్టారో
- January 12, 2017కావాల్సిన పదార్థాలు: సెనగపిండి -150 గ్రాములు, ఎండబెట్టిన మెంతికూర - రెండు టేబుల్ స్పూన్లు, నూనె -తగినంత, పసుపు - చిటికెడు, పెరుగు - రెండు టేబుల్ స్పూన్లు, వాము - అర టీ స్పూను, ఉప్పు -తగినంత, మిరియాల పొడి - అర టీ స్పూను, కారం - అర స్పూను, సోంపు - అర టీ స్పూను.ధనియాల పొడి - ఒక టీ స్పూను, జీలకర్రపొడి - ఒక టీ స్పూను, ఆవాలు - అర టీ స్పూను, జీడిపుప్పు - ఒక టేబుల్ స్పూను.
తయారుచేసే విధానం: శెనగపిండిలో మెంతికూర, పసుపు, పెరుగు, వాము, ఉప్పు, మిరియాలపొడి, ఉప్పు, కారం, తగినన్ని నీళ్లు పోసుకుని కలుపుకోవాలి. దీన్ని ఒకసారి కుక్కర్లో ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత దీన్ని గొట్టాలు చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని నూనె వేయించుకుని పక్కనపెట్టుకోవాలి. మరో గిన్నెలో నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్రపొడి, జీడిపప్పు పొడి, ఉప్పు, కారం వేసి వేయుంచాలి. అందులోనే పెరుగు, కొద్దిగా నీళ్లుపోసి ఉడికించాలి. ఇది దగ్గరికయ్యాక వేయించిపెట్టుకున్న ముక్కల్ని ఇందులో వేసి కలపాలి. బేసిన్ గట్టారో రెడీ.
తాజా వార్తలు
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు