రైల్వే టికెట్లు బార్‌కోడింగ్ కార్డుల ద్వారా...
- January 12, 2017
కరెంట్ బుకింగ్ కౌంటర్లపై పరిశీలిస్తున్న అధికారులు
సాక్షి, హైదరాబాద్: నగదు రహిత సేవల్లో భాగంగా ప్రీ పెయిడ్ కార్డుల ద్వారా టికెట్లు జారీ చేసే విధానాన్ని ప్రారంభించేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. కార్డులపై ఉండే బార్ కోడింగ్ ద్వారా వేగంగా ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం ఉండటంతో ఆ వైపు మొగ్గు చూపుతోంది. ఇప్పటికే రిజర్వేషన్ కౌంటర్లలో పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) యంత్రాలను సమకూర్చి స్వైపింగ్ ద్వారా టికెట్లు జారీ చేస్తున్నారు. ఇవే యంత్రాలను కరెంట్ బుకింగ్ కౌంటర్లలో కూడా అందుబాటులోకి తేవాలని ముందుగా నిర్ణయిం చారు.
స్వైపింగ్‌కు ఎక్కువ సమయం పడుతుం డటంతో వాటితో ఇబ్బందులు తలెత్తుతాయని భావించి ప్రస్తుతానికి వాటిని అందుబాటులోకి తేవద్దని నిర్ణయించారు.
రైలు ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చిన తర్వాత చాలామంది హడావుడిగా వచ్చి టికెట్లు కొంటుంటారు. ఆ సమయంలో స్వైపింగ్ యంత్రాలలో లావాదేవీలు చేయటం వల్ల జాప్యం జరిగి రైళ్లను మిస్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరెంట్ బుకింగ్ కౌంటర్లలో స్వైపింగ్ యంత్రాలు సరికాదని అధికారులు నిర్ణయించారు. వీటికి బదులు బార్‌కోడింగ్ ఉండే కార్డుల ద్వారా వేగంగా టికెట్లు జారీ చేయొచ్చని భావిస్తున్నారు. ఇందుకు ప్రజలకు బార్‌కోడింగ్ ఉండే ప్రీపెయిడ్ కార్డులను జారీ చేయాలని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్
- ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మహిళా కమిషన్ విచారణలో శివాజీ క్షమాపణలు
- బ్యాంక్ సెలవుల జాబితా విడుదల
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్‌లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!







