ఆత్మాహుతి దాడిలో 10 మంది మృతి..
- January 12, 2017
డమాస్కస్: సిరియా రాజధాని డమాస్కస్ సమీపంలోని కఫర్సుసెలో గురువారం ఆత్మాహుతి దాడులు చోటు చేసుకున్నాయి. ఈ దాడుల్లో 10 మంది మృతి చెందగా.. 17 మంది గాయపడ్డారు. పేలుడు పదార్థాలు ధరించిన ఇద్దరు వ్యక్తులు ముహఫజ స్పోర్ట్స్ క్లబ్ వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారని జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. పేలుడు అనంతరం రక్తపు చారికలతో అక్కడ నెలకొన్న భీతావహ దృశ్యాలు స్థానిక మీడియాలో ప్రసారమయ్యాయి.
ఇదిలా ఉండగా డమాస్కస్ పశ్చిమ ప్రాంతం మెజెహ్లోని తమ ఎయిర్‌బేస్‌ను ఇజ్రాయిల్ వార్‌ప్లేన్స్ టార్గెట్‌గా చేసుకున్నాయని సిరియన్ ఆర్మీ శుక్రవారం ఆరోపించింది. ఎయిర్పోర్ట్ పరిధిలో పడిన పలు బాంబులు ఇజ్రాయిల్‌కు చెందినవే అని పేర్కొంది.
తాజా వార్తలు
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!
- సోమాలిలాండ్ గుర్తింపును తిరస్కరించిన కువైట్..!!
- యూఏఈ-భారత్ మధ్య విమాన ఛార్జీలు తగ్గుతాయా?
- సౌదీ అరేబియాలో 13,241 మందిపై బహిష్కరణ వేటు..!!
- లుసైల్ బౌలేవార్డ్ ‘అల్-మజ్లిస్’ డిసెంబర్ 31 టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్‌లో 17.3 శాతం పెరిగిన రియల్ ఇండెక్స్..!!
- తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్
- ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు







