అధిక ధరలు: సూపర్ మార్కెట్ మూసివేత...
- January 12, 2017
మనామా: బహ్రెయిన్‌లోని ఓ సూపర్ మార్కెట్‌కి చెందిన ఐదు బ్రాంచీలను 15 రోజులపాటు మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అధిక ధరలకు వస్తువుల్ని విక్రయిస్తున్నట్లు ఆ సూపర్ మార్కెట్‌పై అభియోగాలున్నాయి. నిర్ధారిత ధరల్ని మించి సూపర్ మార్కెట్లో వస్తువుల్ని విక్రయిస్తున్నట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో ఓ వ్యక్తి పోస్ట్ చేశారు. ఈ వీడియోలో పూర్తి వివరాల్ని పొందుపర్చారు. దాంతో మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ కామర్స్ మరియు టూరిజం లీగల్ యాక్షన్ చేపట్టింది. సూపర్ మార్కెట్ యజమానుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి రిఫర్ చేయడం జరిగింది. కస్టమర్ ప్రొటెక్షన్ డైరెక్టరేట్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఇలాంటి సంఘటనల్ని తమ దృష్టికి తీసుకువస్తే తగిన చర్యల్ని తీసుకుంటామని తెలిపింది.
దుబాయ్‌లో చలి చలి, వర్షం కురిసే అవకాశం
దుబాయ్‌లో గత కొద్ది రోజులుగా చలి వాతావరణం తీవ్రమైంది. దాంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యధిక ఉష్ణోగ్రత 28 సెంటీగ్రేడ్‌గా నమోదవుతోంటే అత్యల్ప ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెంటీగ్రేడ్‌గా నమోదవుతోంది. చలి తీవ్రత ఇంకా పెరిగి ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. నార్త్ వెస్ట్ విండ్స్ అరేబియన్ గల్ఫ్ ప్రాంతంపై ప్రభావం చూపుతున్నాయి. మరో వైపున తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచిస్తోంది. చలి తీవ్రత పెరుగుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పొగమంచుతో విజిబులిటీ తక్కువగా ఉంటుందని వారు వెల్లడిస్తున్నారు.
పొగమంచుతో 144 ట్రాఫిక్ యాక్సిడెంట్స్
దుబాయ్ పోలీసులకు 144 ట్రాఫిక్ యాక్సిడెంట్స్‌కి సంబంధించిన సమాచారం అందింది. ఎమిరేట్ మొత్తం పొగ మంచు కమ్ముకోవడంతో ఈ ప్రమాదాలు జరిగాయి. దుబాయ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, ఒకే రోజు మొత్తం 1,257 ఫోన్ కాల్స్‌ని రిసీవ్ చేసుకుంది వాహనదారుల నుంచి. కంట్రోల్ సెంటర్ యాక్టింగ్ డైరెక్టర్ మేజర్ మొహమ్మద్ జుమా అమన్ మాట్లాడుతూ, మోటరిస్టులు వాహనాలు నడిపే సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. సిగ్నల్స్‌ని వినియోగించడం, అలాగే ఫాగ్ లైట్స్‌ని సరి చూసుకోవడం ముఖ్యమని ఆయన చెప్పారు. మీడియాలో వచ్చే వార్తలు, అలాగే వాతావరణ శాఖ హెచ్చరికల్ని పరిగణనలోకి తీసుకుని వాహనదారులు తమ వాహనాల్ని రోడ్లపైకి తీసుకురావాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!
- సోమాలిలాండ్ గుర్తింపును తిరస్కరించిన కువైట్..!!







