మోక్షజ్ఞ లాంచింగ్ సినిమా నిర్మాత ఫిక్స్..
- January 13, 2017
నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడిగా ఆయన తనయుడు మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ వందో సినిమాలోనే మోక్షజ్ఞ అతిథి పాత్రలో కనిపిస్తాడంటూ ప్రచారం జరిగినా.. కథా పరంగా కుదరకపోవటంతో విరమించుకున్నారు. అయితే తాజాగా మోక్షజ్ఞ లాంచింగ్ సినిమాను తానే నిర్మిస్తున్నట్టుగా ప్రకటించాడు నిర్మాత సాయి కొర్రపాటి.
పలు సక్సెస్ ఫుల్ చిత్రాలతో అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సాయి కొర్రపాటి, బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడు. అందుకే మోక్షజ్ఞను పరిచయం చేసే బాధ్యతను సాయికి అప్పగించాడు బాలయ్య. ప్రస్తుతానికి మోక్షజ్ఞ హీరోగా చేయబోయే సినిమా కోసం కథ ఎంపిక చేసే పనిలో ఉన్నారు నిర్మాత.
వారాహి చలన చిత్ర బ్యానర్ లో తెరకెక్కనున్న ఈ సినిమాను ఎప్పుడు ప్రారంభించేది మాత్రం సాయి కొర్రపాటి ప్రకటించలేదు.
తాజా వార్తలు
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!
- సోమాలిలాండ్ గుర్తింపును తిరస్కరించిన కువైట్..!!







