జనవరి 14న నేనులోకల్ ఆడియో విడుదల..

- January 13, 2017 , by Maagulf
జనవరి 14న నేనులోకల్ ఆడియో విడుదల..

ఎవడే సుబ్రమణ్యం, భలే భలే మగాడివోయ్‌, కృష్ణగాడి వీర ప్రేమగాథ, జెంటిల్ మన్‌, మజ్ను..వరుస ఐదు చిత్రాల సక్సెస్‌తో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న నేచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తిసురేష్ హీరోయిన్‌గా , హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు సమర్పణలో 'సినిమా చూపిస్తా మామా' చిత్రానికి దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్న త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో శిరీష్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం నేను లోకల్‌.'ఆటిట్యూడ్ ఐస్ ఎవిరీథింగ్‌...క్యాప్షన్‌. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల గురించి ....

చిత్ర సమర్పకుడు దిల్ రాజు మాట్లాడుతూ - నేను లోకల్ చిత్రంలో కొత్త నానిని చూస్తారు.

డైరెక్టర్ త్రినాథ్ తనదైన స్టైల్ల్లో, ఎంటర్‌టైన్‌మెంట్‌, మంచి ఎనర్జీ ఉన్న క్యారెక్టర్‌తో రూపొందిస్తున్న లవ్ స్టోరి ఇది. మా బ్యానర్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించిన దేవిశ్రీ అందించిన పాటల విడుదల కార్యక్రమం కాకినాడలో జనవరి 14న జరుగు తుంది. ఈ కార్యక్రమానికి సినీ రంగానికి చెందిన పలువరు ప్రముఖులు హాజరు కానున్నారు. నాని కెరీర్‌లో ఈ చిత్రంలో ఓ డిఫరెంట్ మూవీగా నిలుస్తుంది అన్నారు.
నాని, కీర్తిసురేష్ హీరో హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ : దిల్ రాజు, సినిమాటోగ్రఫి నిజార్ షఫీ, సంగీతం : దేవి శ్రీ ప్రసాద్, కథ - స్క్రీన్‌ప్లే, మాటలు : ప్రసన్న కుమార్ బెజవాడ, రచన : సాయి కృష్ణ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రినాథ రావు నక్కిన, అసోసియేట్ ప్రొడ్యూసర్ : బెక్కెం వేణుగోపాల్, సహ నిర్మాత : హర్షిత్ రెడ్డి, నిర్మాత : శిరీష్,

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com