'తెలుగు వాడిగా నేనూ గర్వపడుతున్నా'...
- January 13, 2017
సంక్రాంతి సందర్భంగా ఖైదీ నెంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి, బాలకృష్ణలకు ప్రశంసల జల్లు కురుస్తోంది. అభిమానులతో పాటు టాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ ఇద్దరు హీరోలను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు...చిరు, బాలయ్యను ప్రశంసిస్తూ ట్విట్ చేశారు. చిరంజీవి 'సినిమా చేసి చాలా రోజులు అయింది' అనే మాట కేవలం మాట వరసకు మాత్రమే. అదే జోరు..అదే ఊపు.. అదే గ్రేసు... జై చిరంజీవా. జగదేకవీరా. అని అన్నారు.
ఇక గౌతమిపుత్ర శాతకర్ణి...తెలుగు వాడి చరిత్ర.. పాత్రలో అద్భుతమైన నటనతో జీవించిన నందమూరి బాలకృష్ణ తెలుగు వాడు. అద్వితీయంగా తెరకెక్కించిన క్రిష్ ఒక తెలుగు వాడు..
తెలుగు వాడి చరిత్ర ని దశ దిశల చాటి చెప్తున్న చిత్ర బృందానికి నా అభినందనలు...సాటి తెలుగు వాడిగా నేనూ గర్వపడుతున్నా..... సాహో శాతకర్ణి.. జయహో శాతకర్ణి అంటూ ట్విట్ చేశారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి







