పాల ముంజలు...
- January 13, 2017
కావలసినవి: కస్టర్డ్ పౌడర్ ఒక కప్పు, పాలు అరలీటరు, చక్కెర పావు కేజీ, నెయ్యి లేదా డాల్డా రెండు స్పూన్లు, (చిన్న ముక్కలుగా తరిగిన) చెర్రీ పళ్లు తగినన్ని.
ఎలా చేయాలి
ముందుగా అరకప్పు పాలలో కస్టర్డ్ పౌడర్‌ను కరిగించాలి. మిగిలిన పాలను ఒక పొంగు వచ్చే వరకు మరగనివ్వాలి. చక్కెర వేసి బాగా కలపాలి. అది కరిగిన తర్వాత కస్టర్డ్-పాల మిశ్రమాన్ని పోస్తూ ఉండలు లేకుండా కలపాలి. మిశ్రమం దగ్గరపడిన తర్వాత కిందికి దించాలి. నెయ్యి లేదా డాల్డా పూసిన ఒక వెడల్పాటి ప్లేటులో ఈ మిశ్రమాన్ని పోసి చెర్రీ ముక్కలతో అలంకరించాలి. చల్లారిన తర్వాత కోవా బిళ్లల్లా గాని, చతురస్రాకారంలో గాని ముక్కలుగా కోసుకోవాలి.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









