ఇంద్రగంటి మల్టీస్టారర్ ప్లాన్..

- January 13, 2017 , by Maagulf
ఇంద్రగంటి మల్టీస్టారర్ ప్లాన్..

అష్ట చమ్మ , గోల్కొండ హై స్కూల్ వంటి విభిన్న కథలతో ప్రేక్షకులను అలరించిన మోహన్ కృష్ణ ఇంద్రగంటి..ఇటీవలే నాని తో జెంటిల్ మెన్ చిత్రానికి దర్శకత్వం వహించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ చిత్ర సక్సెస్ తో నాగ చైతన్య తో సినిమా చేసే అవకాశం వచ్చింది. వారాహి చలన చిత్ర బ్యానర్ ఫై ఈ మూవీ ని సాయి కొర్రపాటి నిర్మిస్తాడని ప్రచారం జరిగింది..కానీ మళ్లీ కొన్ని అనివార్య కారణాలతో ఈ మూవీ ఆగిపోయింది..
దీంతో ఇంద్రగంటి ఒక ఇంట్రెస్టింగ్ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడు.
అడివి శేష్ , అవసరాల శ్రీనివాస్ , వెన్నెల కిషోర్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తారట. ఇటీవల 'క్షణం' తో శేష్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగా.. మిగతా ఇద్దరూ కామెడీ టైమింగ్ విషయంలో తిరుగులేని నటులుగా పేరు తెచ్చుకున్నారు.దీంతో ఈ కాంబినేషన్ నుండి సినిమా అనగానే మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి..ఇక ఈ మూవీ ఎప్పుడు సెట్స్ ఫైకి వస్తుందో..చిత్ర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com