స్వగ్రామానికి సౌదీ జైలు నుంచి...
- January 13, 2017
పదిహేను రోజుల్లో రానున్న లింబాద్రి
జరిమానా చెల్లించడంతో రద్దయిన ఉరిశిక్ష
ఆర్మూర్అర్బన్: హత్య కేసులో సౌదీ జైలులో శిక్ష అనుభవిస్తున్న నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం దేగాంకి చెందిన చేపూర్ లింబాద్రికి ఊరట లభించింది. ఆయన క్షేమంగా స్వదేశానికి రానున్నట్లు తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీనచారి తెలిపారు. దేగాం గ్రామంలో శుక్రవారం రాత్రి చేపూర్ లింబాద్రి భార్య లక్ష్మీని కలిసిన నవీనచారి ఈ మేరకు సమాచారం తెలిపారు. చేపూర్ లింబాద్రి ఉపాధి కోసం పదేళ్ల క్రితం సౌదీ వెళ్లాడు. అయితే, 2007లో హత్య కేసులో చేపూర్ లింబాద్రికి అక్కడి ప్రభుత్వం మరణ శిక్ష విధించింది.
లింబాద్రి అప్పటి నుంచి సౌదీ జైలులో మగ్గుతున్నాడు. నిజామాబాద్ ఎంపీ కవిత విదేశాంగ శాఖ మంత్రి సుష్మ స్వరాజ్ ద్వారా సౌదీ దేశంతో చర్చలు జరిపారు. చర్చల ఫలితంగా నెల రోజుల క్రితం సౌదీకి చెందిన దాత ఒకరు రూ.కోటి 80 లక్షలను చేపూర్ లింబాద్రి తరఫున జరిమానా చెల్లించాడు. దీంతో సౌదీ ప్రభుత్వం చేపూర్ లింబ్రాది మరణ శిక్షను రద్దు చేసింది. లింబాద్రి 15 రోజుల్లో స్వదేశానికి వచ్చేలా న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు నవీనచారి తెలిపారు. ఆయన వెంట టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఇట్టెడి లింగారెడ్డి, సొసైటీ డైరెక్టర్లు రాజు, నర్సయ్య, తదితరులు ఉన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







