స్వగ్రామానికి సౌదీ జైలు నుంచి...

- January 13, 2017 , by Maagulf
స్వగ్రామానికి సౌదీ జైలు నుంచి...

పదిహేను రోజుల్లో రానున్న లింబాద్రి
జరిమానా చెల్లించడంతో రద్దయిన ఉరిశిక్ష
ఆర్మూర్‌అర్బన్‌: హత్య కేసులో సౌదీ జైలులో శిక్ష అనుభవిస్తున్న నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం దేగాంకి చెందిన చేపూర్‌ లింబాద్రికి ఊరట లభించింది. ఆయన క్షేమంగా స్వదేశానికి రానున్నట్లు తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీనచారి తెలిపారు. దేగాం గ్రామంలో శుక్రవారం రాత్రి చేపూర్‌ లింబాద్రి భార్య లక్ష్మీని కలిసిన నవీనచారి ఈ మేరకు సమాచారం తెలిపారు. చేపూర్‌ లింబాద్రి ఉపాధి కోసం పదేళ్ల క్రితం సౌదీ వెళ్లాడు. అయితే, 2007లో హత్య కేసులో చేపూర్‌ లింబాద్రికి అక్కడి ప్రభుత్వం మరణ శిక్ష విధించింది.
లింబాద్రి అప్పటి నుంచి సౌదీ జైలులో మగ్గుతున్నాడు. నిజామాబాద్‌ ఎంపీ కవిత విదేశాంగ శాఖ మంత్రి సుష్మ స్వరాజ్‌ ద్వారా సౌదీ దేశంతో చర్చలు జరిపారు. చర్చల ఫలితంగా నెల రోజుల క్రితం సౌదీకి చెందిన దాత ఒకరు రూ.కోటి 80 లక్షలను చేపూర్‌ లింబాద్రి తరఫున జరిమానా చెల్లించాడు. దీంతో సౌదీ ప్రభుత్వం చేపూర్‌ లింబ్రాది మరణ శిక్షను రద్దు చేసింది. లింబాద్రి 15 రోజుల్లో స్వదేశానికి వచ్చేలా న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు నవీనచారి తెలిపారు. ఆయన వెంట టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఇట్టెడి లింగారెడ్డి, సొసైటీ డైరెక్టర్లు రాజు, నర్సయ్య, తదితరులు ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com