డిజిటల్ ఇండియా కొరకు ఇంకా 80 లక్షల వైఫై హాట్స్పాట్లు
- January 14, 2017
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమం విజయవంతం కావాలంటే దేశ ప్రజలకు ఇంటర్నెట్ కనెక్టివిటీ అవసరం. వైఫై హాట్స్పాట్ల ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే విషయంలో గ్లోబల్ యావరేజ్‌కు చేరుకోవాలంటే.. మన దేశంలో ఇంకా 80 లక్షల హాట్స్పాట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అసోచామ్-డెలాయిట్ నిర్వహించిన సంయుక్త అధ్యయనంలో తేలింది. అయితే ఇప్పటివరకు మన దేశంలో ఉన్న హాట్స్పాట్ల సంఖ్య 31,000 మాత్రమే.
'డిజిటల్ ఇండియా- అన్లాకింగ్ ద ట్రిలియన్ డాలర్ ఆపర్చునిటీ' పేరిట నిర్వహించిన ఈ అధ్యయనంలో.. ప్రతి 150 మందికి ఒక వైఫై హాట్‌స్పాట్ అనేది గ్లోబల్ యావరేజ్‌గా ఉండగా, దీనిని చేరుకోవడానికి దేశంలో భారీ సంఖ్యలో హాట్స్పాట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని వెల్లడించింది. అభివృద్ధి చెందిన దేశాల్లోని మెట్రో నగరాలతో పోల్చినప్పడు భారత్‌లోని మెట్రోనగరాల్లో స్పెక్ట్రం లభ్యత చాలా తక్కువగా ఉందని ఈ అధ్యయనంలో తేలింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







