గోంగూర మటన్ కర్రీ.!
- January 14, 2017
కావలసిన పదార్థాలు: మటన్- అర కిలో, గోంగూర- 3 కట్టలు, తరిగిన పచ్చిమిర్చి- 6, పసుపు- ఒక టీ స్పూను, అల్లంవెల్లుల్లి ముద్ద- ఒక టేబుల్ స్పూను, గరం మసాలా- ఒక టీ స్పూను, తరిగిన ఉల్లిపాయ- ఒకటి, నూనె- ఒక టేబుల్ స్పూను, కారం- 2 టీ స్పూన్లు, ధనియాల పొడి- ఒక టీ స్పూను, జీలకర్ర పొడి- అర టీ స్పూను, ఉప్పు- తగినంత.
తయారీ విధానం: కుక్కర్లో మటన్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, కొద్దిగా ఉప్పు వేసి కొన్ని నీళ్లు పోసి నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి. తర్వాత బాణలిలో నూనె పోసి వేడెక్కాక ఉల్లిపాయలు, గరం మసాలా వేసి ఒక నిమిషం సేపు వేగించాలి. తర్వాత అల్లంవెల్లుల్లి ముద్ద, పసుపు, పచ్చిమిర్చి, గోంగూర వేసి బాగా కలిపి చిన్న మంట మీద ఉడికించాలి. ఆ తర్వాత ఉడికిన మటన్, తగినంత ఉప్పు వేసి కలిపి పది నిమిషాలు ఉడికించి దించేయాలి.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









