ప్రేమ ఒప్పుకోనందుకు యాంకర్ పై ఆసిడ్ దాడి
- January 15, 2017
వన్ సైడ్ లవ్.. ఒక టీవీ యాంకర్ జీవితాన్ని బుగ్గిపాలు చేసింది. తన ప్రేమను ఒప్పుకోలేదన్న కసితో ప్రియుడు పాల్పడ్డ దాడికి ఆమె మొహం ఇప్పుడు గుర్తుపట్టలేనంతలా ఛిద్రమైపోయింది. వివరాల్లోకి వెళితే.. జెస్సికా నోటారో అనే అందగత్తె గతంలో మిస్ ఇటలీ పోటీలో హాట్ ఫేవరిట్‌గా వార్తల్లోకెక్కింది. ఆ తర్వాత టీవీ ఛానల్ ప్రెజంటర్‌గా, డాల్ఫిన్ ట్రైనర్‌గా రకరకాల ప్రొఫెషన్స్‌తో పొట్టపోసుకుంటోంది. ఈ క్రమంలో తారసపడ్డ ఓ కుర్రాడు.. జెస్సికాపై మనసు పారేసుకున్నాడు. తన ప్రేమని వ్యక్తం చేయబోయిన అతగాడ్ని జెస్సికా నిరాకరించింది. కోపగించుకున్న ఆ భగ్న ప్రేమికుడు.. వన్ ఫైన్ మార్నింగ్.. తనకు దక్కని ప్రేయసిపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఆమె మొహం మీద ఆసిడ్ పోసి పారిపోయాడు. దగ్గర్లోని ఆస్పత్రిలో చేరిన జెస్సికా ప్రాణాలకైతే ముప్పు తప్పింది. ఆమె ముఖానికి మాత్రం ప్లాస్టిక్ సర్జరీ అవసరమని డాక్టర్లంటున్నారు. ఒక యాంకరమ్మ వృత్తి జీవితం అలా ముగిసింది మరి.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









