విక్రమ్ కొత్త చిత్రం 'ధ్రువ నక్షత్రం'

- January 15, 2017 , by Maagulf
విక్రమ్ కొత్త చిత్రం 'ధ్రువ నక్షత్రం'

సినిమాలోని పాత్ర కోసం ఏం చేయడానికైనా వెనుకాడని అతికొద్ది మంది నటుల్లో విక్రమ్‌ ఒకరు. ఆయన సినిమాల జాబితాను చూస్తే ఈ విషయం మనకు ఇట్టే అర్థమవుతుంది. విక్రమ్‌, అను ఇమ్మాన్యుయేల్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'ధ్రువ నక్షత్రం'. గౌతమ్‌ వాసుదేవ మేనన్‌ దర్శకుడు. స్పై థ్రిల్లర్‌ మూవీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. హేరిస్‌ జయరాజ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా టీజర్‌ను చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది. టీజర్‌ను చూస్తే హాలీవుడ్‌ స్థాయిలో చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నట్లు కనిపిస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com