మధుర శ్రీధర్ మరో చిత్రం 'ఎ ఫర్ అమెరికా' ..
- January 16, 2017
దర్శకనిర్మాత మధుర శ్రీధర్ ప్రస్తుతం 'ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్' అనే చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మూడు దశాబ్దాల క్రితం రాజేంద్రప్రసాద్ హీరోగా తెరకెక్కిన 'లేడీస్ టైలర్'కి సీక్వెల్ ఇది. వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉండగా మధుర శ్రీధర్ మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. 'ఎ ఫర్ అమెరికా' ఆనే పేరుతో ఆయన నిర్మించనున్న తాజా చిత్రాన్ని సుజయ్-సుశీల్ అనే దర్శకద్వయం తెరకెక్కించనున్నారు. శ్రీధర్ మాట్లాడుతూ ''దర్శకద్వయం చెప్పిన కథ నచ్చింది. కాంటెంపరరీ అర్బన కామెడీ జోనర్లో సాగుతుంది. కథ వినగానే ఈ సినిమాని నిర్మించాలనే నిర్ణయానికి వచ్చాను.
మరో నిర్మాత అప్పిరెడ్డితో కలిసి నిర్మిస్తున్నాను. ఈ చిత్రం కోసం కొత్త నటీనటుల్ని తీసుకోవాలనుకుంటున్నాం'' అని అన్నారు. ఈ సినిమాకు సంగీతం: సునీల్ కశ్యప్.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







