కువైట్ లో రక్త దాన శిబిరం నిర్వహించిన తెలుగు తమ్ముళ్లు
- January 16, 2017
తెలుగుజాతికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చి, వారి ఆత్మగౌరవాన్ని కాపాడిన స్వర్గీయ ఎన్‌టి రామారావు గారి జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు చేపట్టడానికి ఎన్‌టిఆర్ ట్రస్ట్ ద్వారా ఈరోజున ఎంతో మంది నిరుపేదలకు విద్య, వైద్య, బ్లడ్‌బ్యాంకు, ఉపాధి, తాగునీరు, సహాయ పునరావాస కార్యక్రమాల్లో సేవలందిస్తున్నారు.
ఈ సేవలలో భాగంగా అత్యవసర పరిస్థితిలో రక్తం అందక వేలాది మరణాలు సంభవిస్తున్నట్లు ఎన్‌టిఆర్ ట్రస్టు నిర్వాహకులు, సిఎం చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి గుర్తిస్తున్న నేపధ్యంలో ఎంటిఆర్‌కు నివాళిగా రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని జనవరి 18వ తేది ఎన్‌టిఆర్ వర్దంతి పురస్కరించుకుని పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు నిర్వ్హహించాలని పిలుపు ఇచ్చారు.
అయితే కేవలం తెలుగు రాష్ట్రాలలోనే కాక విదేశాలలో కూడా ఎన్ టి ఆర్ ట్రస్ట్ ఈ సేవాకార్యక్రమాలను విసృతం చేసింది.
కువైట్ లో ప్రవాసాంధ్ర తెలుగు దేశం కువైట్ పార్టి డా.స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి జనవరి 18, సందర్భంగా, జనవరి 14, 2017 న జాబ్రియా బ్లడ్ బ్యాంకు సాయంత్రం 3 గంటలనుండి సాయంత్రం 5.30 నిముషముల వరకు రక్తదన శిబిరం నిర్వహించింది.
ప్రవాసాంధ్ర తెలుగు దేశం పార్టీ కువైట్, హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో ప్రతి సంవత్సరం డా.స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతులకి, జయంతులకి బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహిస్తూ ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఇండియన్ డాక్టర్స్ ఫోరం ప్రెసిడెంట్ డా పట్వారి కువైట్ ఏమినేంట్ డాక్టర్ వీరు ప్రతి సంవత్సరం హెల్త్ గైడ్ కువైట్ హెల్త్ మినిస్టర్ ద్వారా విడుదల చేయిస్తూ అటు కువిటీలకి ఇటు ఇండియాన్స్ కి సమన్వయ కర్తగా ఉంటూ మంచి ఆర్గనైజర్ గా గుర్తింపు పొందారు. ప్రవాసాంధ్ర తెలుగు దేశం కువైట్ తాము నిర్వహిస్తున్న ఈ రక్తదాన శిబిరానికి డాక్టర్ పట్వారి ని ముఖ్య అతిధిగా హాజరయి వారు కూడా రక్త దానం చేసి అక్కడికి విచ్చేసినవారికి స్ఫూర్తిదాయకం అయ్యారు కార్యక్రమానికి గౌరవనీయ అతిధి గా ఇండియన్ ఎంబసీ శ్రీ సునీల్ జైన్ హాజరు అయ్యారు.రు.
రక్త దాన శిబిరానికి కువైట్ లోని తెలుగు శేష సంఖ్యలో విచ్చేసి ఎంటిఆర్‌కు నివాళిగా రక్తదానం చేసి ప్రాణదాతలయ్యారు.
ప్రవాసాంధ్ర తెలుగు దేశం పార్టి కువైట్ నిర్వహిస్తున్న ఈ రక్తదాన శిబిరానికి అశేషంగా ప్రజలు విచ్చేసి రక్తదానం చేసి స్వర్గీయ ఎన్టీర్ గారికి నివాళులు అర్పించినవారికి అభినందనలు తెలియజేస్తూ డా.స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతికి కువైట్ ఎన్నారైస్ ఘన నివాళీ మరియు కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రవాసాంధ్ర తెలుగు దేశం పార్టి కువైట్ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ మరియూ కమిటీ సభ్యులకి శుభాభినందనలు తెలియజేసుకుంటోంది.



తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







