క్వాటిప్ లో డబ్బు బదిలీ కార్యాలయానికి ముసుగు వ్యక్తులు నిప్పంటించారు..
- January 16, 2017
ఆదివారం ఆయుధాలు చేతపట్టి మొహాలకు ముసుగులు ధరించిన సాయుధులైన ముగ్గురు ఆగంతకులు క్వాటిప్ ప్రాంతం మియాస్ పరిసరాల్లో ఒక డబ్బు బదిలీ కార్యాలయానికి నిప్పంటించారు. తూర్పు ప్రాంతంలోని పోలీస్ శాఖ మీడియా ప్రతినిధి కల్నల్ జియాద్ అల్ రుఖ్ఐటి మాట్లాడుతూ, ఒక సెక్యూరిటీ గార్డ్ క్వాటిప్ లో ఈ ఘటన గూర్చి ఆదివారం ఉదయం పోలీసులకు నివేదించారని తెలిపారు. చెప్పారు. మెషిన్ గన్స్ తో ముగ్గురు ముసుగు వ్యక్తులు కార్యాలయ ప్రవేశద్వారంకు తొలుత నిప్పంటించారు. ఆ తర్వాత వారు డబ్బు బదిలీ కార్యాలయానికి ముందు మరొక చోట నిప్పు పెట్టినట్లు చెప్పారు. ఈ చర్యతో ఎటిఎం దగ్గరలోని వెలుపల భాగం దెబ్బతిన్నాయి. దాడి చేసిన ఆగంతకులు వెంటనే అక్కడ్నుంచి తప్పించుకున్నారని అల్ రుఖ్ఐటి తెలిపారు. మంటలను అదుపు చేయడానికి సివిల్ డిఫెన్స్ జట్లు రంగంలోనికి దిగేయి, పోలీసులు నేర దర్యాప్ను ప్రారంభించారు. నిప్పు పెట్టిన వ్యక్తులను గుర్తించడానికి వారి ఉద్దేశ్యాలు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో కొత్త సముద్ర మార్గంపై ఇరాన్–ఒమాన్ ఒప్పందం దిశగా కీలక పురోగతి
- 2026 తొలి ఆరు నెలల్లో దుబాయ్ ప్రజా రవాణాలో 34.81 కోట్ల ప్రయాణాలు..
- సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌తో ట్రంప్ కీలక చర్చలు.
- కూటమి సర్కార్ పై జగన్ ఫైర్
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన బహ్రెయిన్, జోర్డాన్ రాజులు..
- ఆపదలో అండగా హరీష్ రావు..పేద విద్యార్థిని చదువుకు చేయూత
- పర్యాటకులకు ఒమాన్ గుడ్ న్యూస్..
- అదనపు పన్నుల వాటా కేటాయింపు..కేంద్రానికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు
- మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్
- తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) అధ్యక్షుడిగా నల్ల భాస్కర్ గుప్త ఏకగ్రీవ ఎన్నిక







