100,000 దిర్హామ్‌ల జరీమానా చెల్లించిన మోటరిస్ట్..
- January 17, 2017
ఎమిఏటీ వ్యక్తి ఒకరు తన వాహనాన్ని నిర్లక్ష్యంగా నడిపిన నేరానికిగాను, 100,000 దిర్హామ్‌లు చెల్లించవలసి ఉంటుంది. పోలీసు రికార్డుల ప్రకారం ఇంపౌండ్ అయిన తన వెహికిల్‌ని తిరిగి తీసుకోవడానికి ఈ మొత్తం అతను చెల్లించాల్సిందే. వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూఏఈ, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, 2015 ఆగస్ట్‌లో ఓ డిక్రీని విడుదల చేశారు. రోడ్లపై అతి వేగంతో, నిర్లక్ష్యంగా దూసుకెళ్ళే వాహనాల్ని నిలువరించేందుకు దుబాయ్ పోలీసులకు అన్ని అధికారాల్ని కట్టబెడుతూ డిక్రీని తీసుకురావడం జరిగింది. ఈ రూల్ అమల్లోకి వచ్చిన తర్వాత 2016లో మొత్తం 1,226 వాహనాల్ని అదుపులోకి తీసుకున్నారు. ఓ బైకర్, 50,000 దిర్హామ్‌లు చెల్లించాడనీ, పేవ్‌మెంట్‌పై వాహనాన్ని నడిపిన నేరానికి ఈ జరీమానా విధించడం జరిగిందని దుబాయ్ ట్రాఫిక్ పోలీస్ డిప్యూటీ డైరెక్టర్ కల్నల్ జమాల్ అల్ బనాయ్ చెప్పారు. పోలీసు డాక్యుమెంట్ల ప్రకారం 2016లో 31 మంది మోటరిస్టులు అక్రమంగా స్ట్రీట్ రేసుల్ని నిర్వహించారు. 325 వాహనాల్ని రెక్లెస్ డ్రైవింగ్ నేపథ్యంలో స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో కొత్త సముద్ర మార్గంపై ఇరాన్–ఒమాన్ ఒప్పందం దిశగా కీలక పురోగతి
- 2026 తొలి ఆరు నెలల్లో దుబాయ్ ప్రజా రవాణాలో 34.81 కోట్ల ప్రయాణాలు..
- సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌తో ట్రంప్ కీలక చర్చలు.
- కూటమి సర్కార్ పై జగన్ ఫైర్
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన బహ్రెయిన్, జోర్డాన్ రాజులు..
- ఆపదలో అండగా హరీష్ రావు..పేద విద్యార్థిని చదువుకు చేయూత
- పర్యాటకులకు ఒమాన్ గుడ్ న్యూస్..
- అదనపు పన్నుల వాటా కేటాయింపు..కేంద్రానికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు
- మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్
- తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) అధ్యక్షుడిగా నల్ల భాస్కర్ గుప్త ఏకగ్రీవ ఎన్నిక







