సీనియర్ కెమెరామెన్ శ్రీనివాస్‌రెడ్డి మృతి
- January 17, 2017
సీనియర్ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డి ఉయ్యూరు(56) మంగళవారం హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో అనారోగ్యంతో కన్నుమూశారు. సీనియర్ డైరెక్టర్ సాగర్‌కు శ్రీనివాస్‌రెడ్డిగారు సోదరుడవుతారు. ఈయనకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. శ్రీనివాస్‌రెడ్డి ఉయ్యూరు సినిమాటోగ్రాఫర్‌గానే కాకుండా మౌళి, సుధాకర్‌బాబు, సాగర్లతో కలిసి మౌళి క్రియేషన్స్ బ్యానర్‌పై సూపర్‌స్టార్ కృష్ణతో జగదేకవీరుడు, అమ్మదొంగా వంటి సినిమాలను నిర్మించారు. నిర్మాత చంటి అడ్డాలతో కలిసి శ్రీనివాస ఆర్ట్స్ బ్యానర్‌పై బాలకృష్ణతో పవిత్రప్రేమ, కృష్ణబాబు, వినీత్, సౌందర్యలతో ఆరోప్రాణం, పూరిజగన్నాథ్, జగపతిబాబుతో బాచి, శ్రీకాంత్ హీరోగా సీనియర్ జర్నలిస్ట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన మొండోడు సినిమాలను నిర్మించాచారు.
రీసెంట్గా రష్మీ గౌతమ్ ప్రధానపాత్రలో రూపొందిన `చారుశీల` సినిమాకు దర్శకత్వం వహించారు. టెక్నిషియన్‌గా, దర్శక నిర్మాతగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస్‌రెడ్డి ఉయ్యూరు మరణం పట్ల ఆయన కుటుంబ సభ్యులకు తెలుగు సినిమా ఇండస్ట్రీ సంతాపాన్ని వ్యక్తం చేసింది. రేపు హైదరాబాద్‌లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయి.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







