జలసమాధి 180 మంది !
- January 18, 2017లిబియాలో సముద్ర తీరంలో ప్రమాదం
రోమ్: ఐరోపా దేశాల్లో వలసల బతుకులు అర్ధంతరంగా ముగిసిపోతున్నాయి. మరుభూమిగా మారిన తమ దేశంలో బతుక లేక... మర పడవల్లో పొరుగు దేశాలకు పయనమవుతున్న శరణార్థులు మధ్యధరా సముద్రంలో జలసమాధి అవుతున్నారు. తాజాగా లిబియా నుంచి ఇటలీకి వెళుతున్న శరణార్థుల్లో 180 మంది మధ్యధరా సముద్రంలో గల్లంతయ్యారు. తూర్పు ఆఫ్రికాకు చెందిన వీరంతా మరణించారని భావిస్తున్నారు. ఏడాది ఆరంభంలో ఇది అతిపెద్ద విషాదం.
శనివారం లిబియా తీరంలో బయలుదేరిన టూటైర్ పడవ... సముద్రంలో ఐదు గంటలు ప్రయాణించింది. ఆ సమయంలో మోటారు చెడిపోయింది. క్రమంగా పడవలోకి నీళ్లు రావడం మొదలుపెట్టాయి. ఒక్కొక్కరుగా ప్రయాణికులు నీటిలో మునిగిపోయారని ప్రత్యక్ష సాక్షుల కథనం ఆధారంగా అధికారులు తెలిపారు.
కాగా, ప్రమాదం నుంచి తప్పించుకున్న 38 మంది వలసదారులు మంగళవారం ట్రపానిలోని సిసిలియాన్ నౌకాశ్రయానికి చేరుకున్నారు. గత ఏడాది వేలాది మంది వలస బాటలో ప్రాణాలు కోల్పోయారు. అంతర్జాతీయ వలసల సంస్థ (ఐఓఎం), ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ (యూఎన్‌హెచ్‌సీఆర్) ప్రతినిధులు, రెస్క్యూ బృందాలు మృతదేహాల కోసం గాలిస్తున్నాయి. 2016లో దాదాపు 1.81 లక్షల మంది శరణార్థులు ఇటలీ తీరానికి చేరినట్టు లెక్కలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!







