ఆర్మీ యూనిఫాంలో తిరుగుతున్న ఉగ్రవాదులు
- January 18, 2017
దాదాపు ఏడుగురు ఉగ్రవాదులు ఆర్మీ యూనిఫాంలో కనిపించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందడంతో దిల్లీలోని విమానాశ్రయం, మెట్రో స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదులు కెప్టెన్, సుబేదార్ ర్యాంకుల్లోని యూనిఫాంలలో ఉన్నట్లు భావిస్తున్నారు. పంజాబ్‌లోని చక్రి, గురుదాస్‌పూర్ సరిహద్దు పోస్ట్‌ల వద్ద అనుమానిత ఉగ్రవాదులు కనిపించినట్లు అమృత్‌సర్‌కు చెందిన ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందింది. వీరు సరిహద్దు నుంచి భారత్‌లోకి చొరబడిన తర్వాత ఆర్మీ దుస్తులు ధరించి ఉంటారని అనుమానిస్తున్నారు.
గణతంత్ర దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో విమానాశ్రయంలో, మెట్రో స్టేషన్లలో మరింతగా భద్రతను పెంచినట్లు సీఐఎస్‌ఎఫ్ అధికారి వెల్లడించారు. భద్రత పెంపుతో విమానాశ్రయాల్లో ప్రయాణికులు కాస్త ఇబ్బందిపడ్డారు. ఒకటికి రెండు సార్లు స్క్రీనింగ్‌లు, ప్రవేశ ద్వారం వద్ద, చెక్-ఇన్ కౌంటర్ల వద్ద బ్యాగులు చెక్ చేయడంతో క్యూ లైన్లు పెరిగిపోయి ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు.
తాజా వార్తలు
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







