మాలిదేశంలో ఆత్మాహుతి దాడి, 40 మంది మృతి

- January 18, 2017 , by Maagulf
మాలిదేశంలో ఆత్మాహుతి దాడి, 40 మంది మృతి

మాలి: ఆఫ్రికాఖండంలోని మాలిదేశంలో జరిగిన ఆత్మహుతి దాడిలో 40 మంది మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. ఆత్మహుతి దాడికి పాల్పడిన వ్యక్తి కారులో వచ్చి తనను పేల్చుకొని ఘాతుకానికి పాల్పడ్డాడు. దేశంలోని ఉత్తర భాగంలో ఉన్న గావో ఎయిర్‌పోర్టు సమీపంలోని మాజీ తిరుగుబాటుదారులు, సైనికుల స్థావరాలపై దాడి జరిగింది. ఈ దాడిలో 40 మంది అక్కడికక్కడే మృతిచెందగా 60 మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మాలీ అధ్యక్షుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com