భూకంపం ఇటలీలో...
- January 18, 2017
- రిక్టర్‌స్కేల్‌పై తీవ్రత 5.3గా నమోదు
రోమ్ : మధ్య ఇటలీలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 5.3గా నమోదైందని యూఎస్ జియోలజికల్ సర్వే అధికారులు తెలిపారు. అమాట్రీస్ నగరానికి 7కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు చెప్పారు. భూకంప ప్రభావంతో అబ్రూజో, మార్చే, లాజియో, రోమ్ నగరాల్లోని ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అయితే, అదృష్టవశాత్తూ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు అన్నారు.
భూకంప ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. ఇదిలా ఉండగా, గతేడాది ఆగస్టులో అమాట్రీస్ నగరంలో భారీ భూకంపం సంభవించింది.
భూకంప తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 6.1గా నమోదైంది. ఈ దుర్ఘటలో 297 మంది మృతి చెందారు.
జపాన్‌లోనూ...
సెంట్రల్ జపాన్‌లో బుధవారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 4.2గా నమోదైందని స్థానిక వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇబారకీ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు చెప్పారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అన్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక
- సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!







