దావోస్‌లో చంద్రబాబు నాలుగో రోజు పర్యటన

- January 19, 2017 , by Maagulf
దావోస్‌లో చంద్రబాబు నాలుగో రోజు పర్యటన

పెట్టుబడులే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు దావోస్‌ పర్యటన నాలుగో రోజు కొనసాగుతోంది. పలు అంతర్జాతీయ కంపెనీ ప్రతినిధులతో పాటు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతోనూ సమావేశమయ్యారు. ఏపీలో రహదారులు విస్తరణ, నేషనల్‌ హైవేల పొడగింపుపై చర్చించారు. అనంతరం.. చంద్రబాబుతో కుమియమి అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ అధ్యక్షుడు యమజికి భేటీ అయ్యారు. ఫండ్‌, టెక్నాలజీ, ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ రంగాల్లో కుమియుమి ఆసక్తి కనబరిచింది. తిరుపతి అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని తెలిపింది. ఇప్పటికే వారణాసి డెవలప్‌మెంట్‌లో కుమియుమి భాగస్వామిగా ఉంది. కన్సార్టియంగా 20 బిలియన్‌ డాలర్ల పెట్టుబడిని ప్రతిపాదించగా.. స్పష్టమైన ప్రణాళికతో రావాలని చంద్రబాబు సూచించారు. మోర్గాన్‌స్టాన్లీ ప్రతినిధులతోనూ చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో వనరుల అవకాశాలను వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com