ఫిబ్రవరి నుంచి మెగాస్టార్ బుల్లితెర ఎంట్రీ.!
- January 19, 2017
ఇటీవలె వెండితెర మీద సత్తా చాటిన మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు బుల్లితెర మీదా తన స్టామినా చూపడానికి సిద్ధమవుతున్నాడు. 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ప్రోగామ్‌ను ఇకపై నాగార్జున స్థానంలో చిరంజీవి హోస్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ షోకు సంబంధించి కొన్ని ఎపిసోడ్స్ షూటింగ్స్ పూర్తయిపోయింది. డిసెంబర్ నెలాఖరు నుంచి ఈ షో ప్రసారం ప్రారంభించాలని అనుకున్నారు. అయితే ఈ షో హోస్టింగ్‌లో ఏవైనా తేడాలొస్తే.. ఆ రిజల్ట్ 'ఖైదీ నెంబర్ 150' మీద పడే అవకాశముందని భయపడి ఆపేశారు. ఇప్పుడు చిరంజీవి కమ్‌బ్యాక్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఈ షోను ఫిబ్రవరి నుంచి ప్రసారం చేయాలని భావిస్తున్నారు నిర్వాహకులు.
ఇప్పటికే ఈ షోకు సంబంధించిన ప్రోమోలు టీవీ ఛానెల్లో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రోమోల సంగతెలా ఉన్నా ప్రోగ్రామ్ మాత్రం బ్రహ్మాండమైన సక్సెస్ సాధిస్తుందని ధీమాగా ఉన్నారు నిర్వాహకులు. మరి, ఆ నిర్వాహకుల ఆశలను చిరంజీవి ఎంతవరకు నెరవేర్చగలడో చూడాలి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







