ఫిబ్రవరి నుంచి మెగాస్టార్ బుల్లితెర ఎంట్రీ.!

- January 19, 2017 , by Maagulf
ఫిబ్రవరి నుంచి మెగాస్టార్ బుల్లితెర ఎంట్రీ.!

ఇటీవలె వెండితెర మీద సత్తా చాటిన మెగాస్టార్‌ చిరంజీవి.. ఇప్పుడు బుల్లితెర మీదా తన స్టామినా చూపడానికి సిద్ధమవుతున్నాడు. 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ప్రోగామ్‌ను ఇకపై నాగార్జున స్థానంలో చిరంజీవి హోస్ట్‌ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ షోకు సంబంధించి కొన్ని ఎపిసోడ్స్‌ షూటింగ్స్‌ పూర్తయిపోయింది. డిసెంబర్‌ నెలాఖరు నుంచి ఈ షో ప్రసారం ప్రారంభించాలని అనుకున్నారు. అయితే ఈ షో హోస్టింగ్‌లో ఏవైనా తేడాలొస్తే.. ఆ రిజల్ట్‌ 'ఖైదీ నెంబర్‌ 150' మీద పడే అవకాశముందని భయపడి ఆపేశారు. ఇప్పుడు చిరంజీవి కమ్‌బ్యాక్‌కు అద్భుతమైన రెస్పాన్స్‌ రావడంతో ఈ షోను ఫిబ్రవరి నుంచి ప్రసారం చేయాలని భావిస్తున్నారు నిర్వాహకులు.

ఇప్పటికే ఈ షోకు సంబంధించిన ప్రోమోలు టీవీ ఛానెల్‌లో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రోమోల సంగతెలా ఉన్నా ప్రోగ్రామ్‌ మాత్రం బ్రహ్మాండమైన సక్సెస్‌ సాధిస్తుందని ధీమాగా ఉన్నారు నిర్వాహకులు. మరి, ఆ నిర్వాహకుల ఆశలను చిరంజీవి ఎంతవరకు నెరవేర్చగలడో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com