మొదలైన మంచు విష్ణు ద్విభాషా చిత్రం.!
- January 19, 2017
టాలీవుడ్ హీరో మంచు విష్ణు తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టనున్నాడు. రామా రీల్స్ సంస్థ నిర్మాణంలో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందనున్న చిత్రంలో విష్ణు కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన సరసన సురభి నటిస్తున్నారు. జి.ఎస్. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని గురువారం లాంఛనంగా జరిపారు. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నటుడు మోహన్‌బాబు క్లాప్ కొట్టగా.. సంగీత దర్శకుడు కీరవాణి కెమెరా స్విచ్చాన్ చేశారు. రచయిత విజయేంద్ర ప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత జాన్ సుధీర్ పూదోట మాట్లాడుతూ 'మోహన్‌బాబు, కీరవాణి, విజయేంద్ర ప్రసాద్ వంటి ప్రముఖులు మా సినిమా ప్రారంభోత్సవానికి రావడం చాలా సంతోషంగా ఉంది. మా పతాకంపై నిర్మించనున్న 5వ సినిమా ఇది. ఎస్.ఎస్. తమన్ స్వరసారధ్యం వహించనున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నాం. ఈ రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది' అని తెలిపారు.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







