పోసాని 'నేను కిడ్నాప్ అయ్యాను'
- January 19, 2017
ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రలో నటించనున్న చిత్రం 'నేను కిడ్నాప్ అయ్యాను'. ఈ సినిమా చిత్రీకరణ గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. టి.ప్రసన్న కుమార్ సినిమాకు క్లాప్‌నిచ్చారు. దగ్గుబాటి వరుణ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా పోసాని మీడియాతో మాట్లాడుతూ.. 'ఇందులో నేనే ప్రధాన పాత్రలో నటిస్తున్నాను. నేనో పారిశ్రామికవేత్తగా కనిపిస్తాను. ఐదుగురు అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి నన్ను కిడ్నాప్ చేస్తారు. ఎందుకు ఏమిటి ఎలా అనే అంశాలపై సినిమా నడుస్తుంది. చాలా ఆసక్తికరంగా ఉంటుంది' అన్నారు. దర్శకుడు శ్రీకర్‌బాబు తెరకెక్కించనున్న ఈ చిత్రానికి మాధవి అద్దంకి నిర్మాతగావ్యవహరిస్తున్నారు. ఇందులో బ్రహ్మానందం, కార్టూనిస్ట్ మల్లిక్, రఘుబాబు, పృథ్వీ, కృష్ణభగవాన్ తదితరులు నటిస్తున్నారు.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







