ఆంధ్రప్రదేశ్‌కు చైనా పెట్టుబడుల రాక...
- January 19, 2017ముఖ్యమంత్రికి హామీ ఇచ్చిన మెకెన్సీ గ్లోబల్ సంస్థ
దావోస్ విశేషాలను విడుదల చేసిన సీఎం కార్యాలయం
ఆంధ్రప్రదేశ్‌కు చైనా పెట్టుబడుల రాకను సులభతరం చేసే బాధ్యతను తాను తీసుకుంటానని మెకెన్సీ గ్లోబల్ ఇనిస్టిట్యూట్ సంచాలకుడు జోనాథన్ ఓజల్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హామీ ఇచ్చినట్లు సీఎం కార్యాలయం తెలిపింది. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో బుధవారం చంద్రబాబు పలు సంస్థల ప్రతినిధులతో జరిపిన సమావేశాల వివరాల ను బుధవారం మీడియాకు విడుదల చేసింది. సీఎంతో జరిగిన సమావేశంలో గ్లోబల్ మెకెన్సీ సంచాలకుడు జోనాథన్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక వనరులు, పెట్టుబడులు సమకూర్చడంలో మెకెన్సీ గ్లోబల్ ముఖ్య భూమిక పోషించాలని సీఎం కోరారు.
జేపీ మోర్గాన్ ఛేస్ వాణిజ్య వ్యూహ విభాగ అధిపతి మాక్స్ న్యూకిర్షెన్‌తో జరిగిన భేటీలో రాష్ట్రంలో ని సహజ వనరులు, పెట్టుబడులకున్న అవకాశాలను వివరించారు.ఆఫ్టికల్ ఫైబర్ కేబుల్ సపోర్టింగ్ షీట్లు తయారు చేసే టీజిన్ లిమిటెడ్ సంస్థ అధ్యక్షుడు జున్ సుజుకీతే సమావేశమై ఏపీని పెట్టుబడులకు గమ్యస్థానంగా ఎంచుకోవాలని కోరారు.
తిరుపతి అభివృద్ధిలో కుమియుమి!
కుమియుమి అస్సెట్స్ కంపెనీ అధ్యక్షుడు యసుయో యమజకితో సమావేశమై తిరుపతి నగరం అభివృద్ధిలో పాలుపంచుకోవాలని సీఎం కోరారు. అందుకు సమ్మతించిన యసుయో ఇప్పటికే వారణాసి నగరాభివృద్ధిలో భాగస్వామిగా ఉన్నామని తెలిపారు. భారత్‌లో తాము ఐదు బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు జనరల్ అట్లాంటిక్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ నాయక్ తెలిపారు. అమరావతి నుంచి జాతీయ, అంతర్జాతీయ ఎయిర్ కనెక్టివిటీపై స్పైస్ జెట్ ఛైర్మన్ అజయ్‌సింగ్‌తో జరిగిన సమావేశంలో చర్చించారు. సిస్కో ఛైర్మన్ జాన్‌తో సమావేశమై దావోస్ సదస్సు విశేషాలను చర్చించారు. జేబీఐసీ ప్రతినిధి తడాషి మెడా, సుజ్లాన్ గ్రూప్ ప్రతినిధులతోనూ సీఎం సమావేశమయ్యారు.
ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ పెట్టుబడులు
రాష్ట్రంలో 500 పడకల హాస్పిటల్‌ను ఏర్పాటు చేయడానికి బ్రిటన్‌కు చెందిన ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ ఆసక్తి చూపింది.అంతకుముందు కెనడా నవకల్పనలు, శాస్త్ర పరిజ్ఞానం, ఆర్థికాభివృద్ధి శాఖ మంత్రి నవదీప్ బెయిన్ సీఎంను కలిసి కెనడా పర్యటనకు రావల్సిందిగా కోరారు. ముఖ్యమంత్రి చర్చలు జరిపిన వారిలో మిత్సుయి గ్లోబల్ ప్రతినిధి టొమోయికి, నోవార్టిస్ ఫార్మా ప్రెసిడెంట్ డాకట్ర్ ఆండ్రే, జనరల్ ఎలక్ట్రిక్ ఆయిల్ అండ్ గ్యాస్ సంస్థ ప్రతినిధి లోరెంజోలతో పాటు వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులున్నారు.
తాజా వార్తలు
- IIFA ఉత్సవం.. మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం..
- జిసిసిలో సివిల్ ఏవియేషన్.. కీలక అంశాలపై సమీక్ష..!
- బహ్రెయిన్ జలాల్లో చేపల వేట..నలుగురు భారతీయులు అరెస్ట్
- యూఏఈ వీసా క్షమాభిక్ష పథకం.. అథారిటీ కీలక అప్డేట్ జారీ..!!
- ఖతార్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ 2024-2030 ప్రారంభం..!
- రియాద్ లైట్ ఫెస్టివల్ 2024.. నవంబర్ 28న ప్రారంభం..!!
- కువైట్ లో రాబోయే రోజుల్లో వర్షాలు..!
- ప్రధాని మోదీ మూడు రోజుల అమెరికా పర్యటన
- చరిత్ర సృష్టించిన టీమిండియా, ఆసియా హాకీ ట్రోఫీ విజేతగా భారత్
- ప్రపంచంలో రాత్రిళ్ళు లేని దేశాల గురించి తెలుసా..?