APNRT కో-ఆర్డినేటర్ భాస్కర్ రావు మేడికొండ(సౌదీ అరేబియా) తో ముఖాముఖి
- January 19, 2017
ప్ర) ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ కో-ఆర్డినేటర్లుగా మీ బాధ్యత ఏమిటి?
జ) ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ కో-ఆర్డినేటర్లు గా, మన నాన్ రెసిడెంట్ తెలుగు వారి అందరికి , APNRT యొక్క ప్రాముఖ్యతని మరియు మన రాష్ట్ర ప్రభుత్వము శ్రీ నారా చంద్రబాబు నాయుడి గారి ఆధ్వర్యములో NRI ల సంక్షేమం కొరకు మరియు అభివృద్ధి కొరకు చేయుచున్న కార్యక్రమ వివరాలని తెలియపరచి APNRT లో సభ్యత్వము తీసుకునే విధముగా ప్రోత్సాహించి ,సభ్యత్వము వలన కలుగు ప్రయోజనాలని తెలియపరచాలి .
అదే విధముగా APNRT ద్వారా , నాన్ రెసిడెంట్ తెలుగు వారిని మన రాష్ట్ర అభివృద్ధి లో పాలుపంచుకునేలా ప్రోత్సాహపరచాలి .
ప్ర) ఆంధ్రప్రదేశ్‌తో విదేశాల్లోని తెలుగువారిని కలిపేందుకు ముందుకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం పట్ల మీ స్పందన ఏమిటి?
జ) శ్రీ నారా చంద్రబాబు నాయుడి గారి ఆలోచన చాలా గొప్పది మరియు అద్భుతమైనది . తెలుగు వారినందరిని APNRT ద్వారా కలిపి , NRI సంక్షేమం కొరకు చేయుచున్న సేవలు చాలా బాగున్నాయి.
ప్ర) మాతృభూమికి ఎంతో కొంత చేయాలన్న సంకల్పం చాలా గొప్పది, ఈ సంకల్పాన్ని విదేశాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కి చెందినవారెలా భావిస్తున్నారు?
జ) చాలా మంది NRI లు అందరు తమ వంతు గా శ్రీ నారా చంద్రబాబు నాయుడి గారి ఆధ్వర్యము లోని APNRT ద్వారా మాతృభూమికి సేవ చేయటకి ఆసక్తి చూపిస్తున్నారు . మాతృభూమి అభివృద్ధికి సహాయ పడని వారు ఎవరు ఉంటారు చెప్పండి .
ప్ర) కొత్త రాష్ట్రం, కోటి సమస్యలతో ఏర్పడ్డ రాష్ట్రానికి ఎన్‌ఆర్‌ఐల తోడ్పాటు ఎలా ఉంటే బావుంటుందనుకుంటున్నారు?
జ) ప్రపంచం మొత్తం మన కొత్త రాష్ట్రము వైపు చూస్తుంది , మన రాష్ట్రము లో ని వివిధ సహజ వనరుల లభ్యత ,మన తెలుగు ప్రజల పనితీరుతో పాటు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడి గారి ముందు చూపు మరియు ప్రజా సేవ పట్ల ఉన్న అంకిత భావం మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదం లో నడిపిస్తుంది .
ఇటువంటి సమయములో తెలుగు NRI లు , పరిశ్రమలు స్థాపించటములోను ,విద్యాలయాలు ,వైద్యాలయాలు స్థాపించటములోను , పెద్ద పెద్ద భవనాలు , రోడ్లు నిర్మాణములోను మన తెలుగు రాష్ట్ర అభివృద్ధి లో తోడ్పడినట్లైతే అనేక ఉద్యోగ అవకాశాలు కల్పించబడి నిరుద్యోగ శాతం తగ్గటంతోపాటు మన రాష్ట్రము దేశములోనే No .1 గా అవుతుంది.
ప్ర) ఇప్పటిదాకా ఎప్పుడూ ఎక్కడా లేని కొత్త విధానం, కొత్త ఆలోచన ఇది. ఈ ఆలోచన విదేశాల్లో ఉన్న వారిగా మీకెలా అనిపిస్తోంది?
జ) నిజాము గా కొత్త ఆలోచనే , ఇక్కడ ఒక విషయం చెప్పాలి .. APNRT ఏర్పడకముందు , NRI లకి ఉన్న స్వల్ప కాలపు సెలవు లో ప్రభుత్వ సంస్థలలో ఏదైనా ధ్రువ పాత్రలని పొందాలన్న , కుటుంబంతో కలసి దేవాలయాలకు వెళ్ళాలన్న చాలా ఇబ్బందులను ఎదుర్కొనాలసి వచ్చేది.. ఇటువంటి ఇబ్బందులన్నిటిని APNRT ద్వారా సులువు గా పరిష్కరించుకునే వీలు కల్పించింది మన రాష్ట్ర ప్రభుత్వం .NRI అందరికి కావలసిన సేవలనన్నిటిని APNRT కల్పిస్తుంది ... ఇది నిజంగా అద్భుతమే ..
ప్ర) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకు ఈ విషయంలో అందించే సహాయ సహకారాలు ఎలా ఉంటున్నాయి?
జ) నేను సౌదీ అరేబియా- జెద్దా లో ఉంటున్నాను , ఇక్కడ తెలుగు వారికి ముఖ్యముగా కార్మికులకు చాలా ఇబ్బందులు ఉన్నాయ్ . ఒక్క సౌదీ అరేబియా అని మాత్రమే కాకుండా MIDDLE EAST లో ఉండే కార్ముకులందరు చాలా ఇబ్బందులు పడుతున్నారు . ఇక్కడి ఇబ్బందులని ,జీవన విధానాలని మన రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకోవటానికి APNRT సహాయ పడాలని కోరుకొనుచున్నాను.
ప్ర) మాతృభూమికి సేవ చేయడం ఓ గొప్ప అవకాశం. ఆ అవకాశం కల్పించిన ప్రభుత్వానికి మీ తరఫున ఎలా కృతజ్ఞత తెలుపుతారు?
జ) మాతృభూమికి సేవ చేయటం చాలా గొప్ప అవకాశం .NRI లు అందరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని పుట్టిన ఊరి అభివృద్ధిలో పాలుపంచోకోవాలని కోరుకొనుచున్నాను . ఇటువంటి అవకాశాన్ని ఇచ్చిన్న శ్రీ నారా చంద్రాబునాయుడి గారికి APNRT కి నా హృదయపూర్వక ధన్యవాదములు.
ప్ర) ప్రభుత్వ ఆలోచనల్ని విదేశాల్లో ఉన్న ఎన్‌ఆర్‌ఐల వద్దకు తీసుకెళ్ళడానికి మీరు చేపట్టే ప్రత్యేక కార్యక్రమాల వివరాలు?
జ) APNRT ద్వారా తెలుగు NRIs అందరికి రాష్ట్ర ప్రభుత్వం చేయుచున్న సేవ కార్యక్రమ వివరాలని ,రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనలైన తెలుగు వారిని కలపటం, మన నూతన రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలని ,మాతృభూమిని అభివృధి పరుచుటకు తీసుకొనుచున్న ఆలోచనలని ,జెద్దా నగరములో ని తెలుగు వారి అందరికి E - mails ద్వారాను, కొన్ని ప్రాంతాలలోని తెలుగు వారిని కలవటం ద్వారాను,మరియు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా తెలియచేయుచున్నాము.
చివరిగా ఒకమాట ------మనసుంటే మార్గం ఉంటుంది -------
మాతృభూమికి సేవ చేయాలనే తపన కోరిక ఉన్నట్లయితే మన రాష్ట్ర APNRT NRIs అందరికి ఒకమార్గం ...
తాజా వార్తలు
- అల్ దఖిలియాకు పోటెత్తిన టూరిస్టుల..పర్యాటక ప్రదేశాల్లో రద్దీ..!!
- హైదరాబాద్ విమానాశ్రయం నుండి వియెట్నాం, హో చి మిన్కు విమాన సేవలు ప్రారంభం
- తెలంగాణలో మెక్డొనాల్డ్స్ గ్లోబల్ సెంటర్.. !
- ఏపీ: విశాఖ, విజయవాడ మెట్రోకు కేంద్రం నిధులు విడుదల !
- స్విస్ ఓపెన్: శ్రీకాంత్ శుభారంభం..
- ధోఫర్లో మర్డర్..వ్యక్తి మృతికి గొడవే కారణమా?
- దుబాయ్, షార్జా మధ్య ఈజీ ట్రాఫిక్ కోసం కొత్త రూల్స్..!!
- గాజా మారణహోమంపై ప్రపంచదేశాలు స్పందించాలి: సౌదీ అరేబియా
- చట్టాల ఉల్లంఘన.. రియల్ ఎస్టేట్ డెవలపర్ సస్పెండ్..!!
- ఇండియన్ ఎంబసీలో రమదాన్ సెలబ్రేషన్స్..వెల్లివిరిసిన సోదరభావం..!!