మరో మైలు రాయి నమోదుకానుంది ఇస్రో చరిత్రలో..

మరో మైలు రాయి నమోదుకానుంది ఇస్రో చరిత్రలో..

నెల్లూరు: ఇస్రో చరిత్రలో మరో మైలు రాయి నమోదుకానుంది. ఫిబ్రవరి 15న పీఎస్‌ఎల్‌వీ సీ37 రాకెట్‌ ద్వారా ఒకే సారి 104 ఉపగ్రహాలు నింగిలోకి పంపేందుకు ఏర్పాట్లు చేశారు. అందులో 101 విదేశీ ఉపగ్రహాలు ఉన్నాయి. మిగతావి దేశీయ ఉపగ్రహాలు. ఇప్పటివరకు పీఎస్ఎల్‌వీ ద్వారా ప్రయోగించిన ఉపగ్రహాలన్ని చాలావరకు విజయవంతమయ్యాయి. ఒకేసారి 104 ఉపగ్రహాలు నింగిలోకి పంపడం ద్వారా ఇస్రో చరిత్రలో నిలిచిపోనుంది.

 

Back to Top