షీరా లడ్డు..

- January 20, 2017 , by Maagulf
షీరా లడ్డు..

కావలసినవి : పాలు ఒక కప్పు కండెన్స్‌డ్‌ మిల్క్‌ అరకప్పు, నెయ్యి నాలుగు టేబుల్‌ స్పూన్లు, బొంబాయి రవ్వ నాలుగు టేబుల్‌ స్పూన్లు, యాలకుల పొడి ఒక టీ స్పూను, ఎండు ద్రాక్ష రెండు టేబుల్‌ స్పూన్లు, సన్నగా కోసుకున్న ఆల్మండ్‌ పప్పులు ఒక టేబుల్‌ స్పూను. ఈ చివరి రెండూ మీకు ఇష్టమైతేనే.
తయారుచేసే పద్ధతి
మూకుట్లో నెయ్యి వేసి వేడెక్కాక రవ్వపోసి బంగారు రంగు వచ్చేంత వరకు వేగించండి. వేరే గిన్నెలో పాలు, కండెన్స్‌డ్‌ మిల్క్‌ కలిపి దానిలో ఈ రవ్వ, యాలకుల పొడి వేసి బాగా కలపండి. నెయ్యి పైకి తేలేదాకా కలుపుతూ ఉండండి. వేగించిన ఎండుద్రాక్ష కూడా వేశాక దించి లడ్డుల్లా చేసుకోండి. ఇష్టముంటే ఆల్మండ్స్‌ లేదా జీడిపప్పుల్ని పైన అలంకరించుకోండి.కావలసినవి : పాలు ఒక కప్పు కండెన్స్‌డ్‌ మిల్క్‌ అరకప్పు, నెయ్యి నాలుగు టేబుల్‌ స్పూన్లు, బొంబాయి రవ్వ నాలుగు టేబుల్‌ స్పూన్లు, యాలకుల పొడి ఒక టీ స్పూను, ఎండు ద్రాక్ష రెండు టేబుల్‌ స్పూన్లు, సన్నగా కోసుకున్న ఆల్మండ్‌ పప్పులు ఒక టేబుల్‌ స్పూను. ఈ చివరి రెండూ మీకు ఇష్టమైతేనే.
తయారుచేసే పద్ధతి
మూకుట్లో నెయ్యి వేసి వేడెక్కాక రవ్వపోసి బంగారు రంగు వచ్చేంత వరకు వేగించండి. వేరే గిన్నెలో పాలు, కండెన్స్‌డ్‌ మిల్క్‌ కలిపి దానిలో ఈ రవ్వ, యాలకుల పొడి వేసి బాగా కలపండి. నెయ్యి పైకి తేలేదాకా కలుపుతూ ఉండండి. వేగించిన ఎండుద్రాక్ష కూడా వేశాక దించి లడ్డుల్లా చేసుకోండి. ఇష్టముంటే ఆల్మండ్స్‌ లేదా జీడిపప్పుల్ని పైన అలంకరించుకోండి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com