ఘోర రోడ్డు ప్రమాదం : 16 మంది మృతి..
- January 21, 2017
రోమ్ :
ఉత్తర ఇటలీలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హంగేరికి చెందిని విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురికావడంతో మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందగా, 36 మందికి గాయాలయ్యాయని ఇటలీ పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అతి వేగంగా ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి పైలాన్ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 52 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా హంగేరియాకు చెందిన 16 నుంచి 18 ఏళ్ల వయస్సున్న విద్యార్థులుగా సమాచారం. స్కూల్ ట్రిప్ ముగించుకొని ఫ్రాన్స్ వస్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- దుబాయ్ స్కూళ్లలో పీఈ క్లాసులకు ఆమోదం..!!
- సౌదీలో 500కు పైగా హెరిటేజ్ ప్రదేశాల్లో పునరుజ్జీవ కార్యక్రమాలు..!!
- బహ్రెయిన్ లో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం..!!
- షార్జాలో Dh3 మిలియన్ ఫ్రాడ్..క్రిమినల్ నెట్వర్క్ అరెస్టు..!!
- కువైట్‌కు సంఘీభావంగా బెంగాలీ సొసైటీ..క్రాఫ్ట్ వర్క్‌షాప్..!!
- ఇబ్రా, అల్ ముధైబి ఆరోగ్య కేంద్రాల్లో త్వరలో వైద్యసేవలు..!!
- 55 రోజుల తర్వాత కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం









