పొట్లకాయ ఎండు రొయ్యలు...

- January 21, 2017 , by Maagulf
పొట్లకాయ ఎండు రొయ్యలు...

కావలసిన పదార్థాలు: పొట్లకాయ - 1, ఉల్లి తరుగు - అరకప్పు, పచ్చికొబ్బరి తరుగు - పావు కప్పు, ఎండు మిర్చి - 4, ఉప్పు - రుచికి తగినంత, ఎండు రొయ్యలు - అరకప్పు, దనియాల పొడి - ముప్పావు టీ స్పూను, పసుపు - అర టీ స్పూను.
తయారుచేసే విధానం: పొట్లకాయ గింజలు లేకుండా శుభ్రం చేసి క్యూబ్స్‌గా కట్‌ చేయాలి. ఎండుమిర్చి + పచ్చికొబ్బరి పేస్టు చేసుకోవాలి. రొయ్యలను కడిగి నీరు వార్చాలి. కడాయిలో ఉల్లి తరుగు, పొట్ల ముక్కలు, రొయ్యలు వేసి, కొద్ది నీరు చిలకరించి మూతపెట్టి, ముక్కలు సగం ఉడికినతర్వాత దనియా పొడి, పసుపు, కొబ్బరి మిశ్రమం, ఉప్పు వేసి చిక్కబడేవరకు ఉంచాలి. వేడి వేడి అన్నంతో ఎంతో రుచిగా ఉండే ఈ కూరలో నూనె లేకపోవడం గమనించండి. అతి సులభంగా చేసుకునే కూర.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com