ప్రధాని సంతాపం...
- January 22, 2017
న్యూదిల్లీ: విజయనగరం జిల్లాలో శనివారం అర్థరాత్రి జరిగిన రైలు ప్రమాద మృతులకు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు రైల్వేస్టేషన్ వద్ద హీరాఖండ్ ఎక్స్ప్రెస్ శనివారం రాత్రి పట్టాలు తప్పిన విషయం విదితమే. ఈ ప్రమాదంలో 32మందికి పైగా మృతిచెందారు. దీనిపై ప్రధానమంత్రి స్పందిస్తూ.. ఇది విషాదకర ఘటన అని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఆత్మీయులను కోల్పోయిన వారందరికి సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా సంతాపం ప్రకటించారు. ‘ఈ ఘటన చాలా విచారకరం.. బాధాకరం.. విలువైన ప్రాణాలను కోల్పోయాం’ అని ట్విటర్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







