అక్రమ మనీ ట్రాన్స్‌ఫర్‌ కార్యాలయాలపై ఉక్కుపాదం..

- January 22, 2017 , by Maagulf
అక్రమ మనీ ట్రాన్స్‌ఫర్‌ కార్యాలయాలపై ఉక్కుపాదం..

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ (డిఇడి), 25 షాపులపై ఒకే రోజు దాడులు నిర్వహించి, జరీమానాలు విధించింది. అక్రమంగా మనీ ట్రాన్సఫర్స్‌ని ఈ షాప్‌లు నిర్వహిస్తున్నట్లుగా అధికారుల తనిఖీల్లో తేలింది. అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందుకున్న డిఇడి, పలు టీమ్స్‌ని సోదాల కోసం నియమించింది. అనుమానం రాకుండా ఈ షాప్‌లు బెంగాలీ భాషలో ప్రచారం చేసుకుంటున్నాయని కమర్షియల్‌ కంపెనీస్‌ మరియు కన్జ్యూమర్‌ ప్రొటెక్షన్‌ సెక్టార్‌ - డిఇడి సిఇఓ మొహమ్మద్‌ అలి రషెద్‌ లూతా చెప్పారు. బంగ్లాదేశ్‌ నుంచి తీసుకొచ్చిన ఎలక్ట్రానిక్‌ పరికరాలను ఉపయోగించి సిమ్‌ కార్డ్స్‌ ద్వారా అక్రమ మనీ ట్రాన్స్‌ఫర్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అధికారిక మనీ ట్రాన్స్‌ఫర్‌ కేంద్రాల నుంచి మాత్రమే ప్రజలు లావాదేవీలు నిర్వహించాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు. ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com