కొత్త ట్రాఫిక్ సిగ్నల్స్‌తో పాదచారులకు ఊరట..
- January 22, 2017
రోడ్లపై పాదచారులను ప్రమాదాల నుంచి గట్టెక్కించడానికిగాను 'సఫర్ రూట్స్'ని ప్రవేశపెడుతున్నారు. ఈ మేరకు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, కొత్త తరహా పాదచారుల లైట్స్‌ని అల్ సాదా స్ట్రీట్‌లో పరీక్షించింది. క్రాసింగ్స్ వద్ద పాదచారుల వెయిటింగ్‌ని తగ్గించేలా ఈ లైటింగ్ సిస్టమ్‌ని రూపిందించారు. పాదచారులకు తగిన విధంగా ఆటోమేటిక్‌గా ఈ లైట్లు పనిచేస్తాయి. ఆర్టిఏ ట్రాఫిక్ మరియు రోడ్స్ ఏజెన్సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మెథా బిన్ అదాయ్ మాట్లాడుతూ, కొత్త సిగ్నల్స్ పాదచారులకు ఉపయుక్తంగా ఉంటాయని అన్నారు. అలాగే రహదార్లపై ట్రాఫిక్ జామ్స్ కూడా వీటివల్ల కలగబోవని వివరించారాయన. నడకను ప్రోత్సహించే క్రమంలో వీటిని రూపొందించినట్లు తెలిపారు. సెన్సార్ బేస్డ్ స్మార్ట్ యూనిట్ ఆధారంగా ఈ సిగ్నలింగ్ సిస్టమ్ పనిచేస్తుంది. దుబాయ్ వ్యాప్తంగా ఈ సరికొత్త సిగ్నలింగ్ సిస్టమ్‌ని అందుబాటులోకి తెస్తారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







