జాతిపితకు ఇంత అవమానమా..!
- January 23, 2017
ఆంధ్రజ్యోతి: ఆన్లైన్లో అమ్మకాలు పెంచుకునేందుకు కొన్ని సంస్ధలు ఎంతటి ఘోరానికైనా దిగజారుతున్నాయి. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్ధ జాతి పిత మహాత్ముని బొమ్మను చెప్పులపై ముద్రించి భరత జాతిని అవమానించింది. గతంలో ఇలాంటి తప్పిదాలకు పాల్పడిన అమెజాన్ మరోసారి భారతీయుల విశ్వాసాలతో ఆడుకుంది. విషయం తెలుసుకున్న భారత విదేశాంగశాఖా మంత్రి సుష్మా స్వరాజ్ గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో ఆ సంస్ధ దిగి వచ్చింది. ఆన్లైన్లో అమ్మకాలు పెంచుకునేందుకు ప్రజల విశ్వాసాలతో ఆటలాడటం అమెజాన్‌కు కొత్తేమీ కాదు. గతంలో చెప్పులు, అండర్ వేర్లు, డోర్ మ్యాట్లు, బీర్లపై భారతీయ దేవతల బొమ్మలను ముద్రించి విక్రయాలు కొననసాగింది.
దీంతో అప్పట్లో భారతీయుల నుంచి గట్టి వ్యతిరేకత వ్యక్తమవడంతో వెనక్కి తగ్గింది. తాజాగా జాతిపిత మహాత్మాగాంధీ బొమ్మను అమెజాన్ వెబ్సైట్ కించపరిచింది. మహాత్ముని బొమ్మను ఫ్లిప్-ఫ్లాప్ చెప్పులపై ముద్రించి అమ్మకాలు సాగించింది. అమెరికా, కెనడా వెబ్సైట్లలో ఈ చెప్పులు దర్శనమిచ్చాయి.
చెప్పులపై మహాత్ముని బొమ్మను వెబ్సైట్లో గమనించిన భారతీయులు ట్విట్టర్లో సుష్మా స్వరాజ్‌కు తెలియపరిచారు. దీంతో అమెజాన్‌పై సుష్మా ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయులకు బేషరుతుగా క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు. భారతీయులను కించపరిచే విధంగా ఉన్న వస్తువులను వెబ్సైట్ల నుంచి తొలగించాలని లేదంటే ఇండియాలో వ్యాపారం చేసుకోనివ్వబోమని, సంస్ధ సిబ్బందికి వీసాలు మంజూరు చేసేది లేదని ఆమె స్పష్టం చేశారు.
సుష్మా దెబ్బకు అమెజాన్ దిగి వచ్చింది. జరిగిన తప్పుకు వివరణ ఇచ్చింది. భారతీయుల విశ్వాసాలపై తమకు గౌరవముందని, వెంటనే ఆయా వస్తువులను తొలగించామని వివరణ ఇచ్చింది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







