ఇటలీలో ప్రమాదానికి గురైన స్కూలు బస్సు:16 మంది విద్యార్ధులు మృతి..
- January 23, 2017
ఇటలీలో టీనేజర్లను తీసుకెళుతున్న స్కూలు బస్సు ప్రమాదానికి గురై మంటలు చెలరేగడంతో 16 మంది సజీద దహనమయ్యారు. మరో 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి వెరోనా సమీపంలో చోటుచేసుకుంది. ఫ్రాన్స్‌లోని ఓ పాఠశాలకు చెందిన 50 మంది విద్యార్థులు టూర్‌కు వెళ్ళి తిరిగి వస్తున్న బస్సు పైలాన్‌ను ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందరూ గాఢనిద్రలో ఉండడం, డోర్లు తెరుచుకోకపోవడంతో క్షణాల్లో బస్సు మొత్తం మంటలు వ్యాపించి భారీగా ప్రాణనష్టం జరిగింది. హుటాహుటిన ప్రమాదస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవరుతోపాటు అతని కుటుంబసభ్యులు ఈ ప్రమాదంలో ప్రాణాలు వదిలినట్లు ఇటలీకి చెందిన పత్రికా ఏజెన్సీ వెల్లడించింది. ప్రయాణీకుల్లో ఎక్కువమంది హంగేరియాకు చెందిన వారు ఉండగా.. వీరిలో 16 నుంచి 18 ఏండ్లలోపు వారు అధికంగా ఉన్నట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







